Keerthy Suresh : బ్రేకింగ్.. మహానటికి కరోనా.. హోం ఐసోలేషన్ లో కీర్తి సురేష్..!
Keerthy Suresh : నటి కీర్తి సురేష్.. కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. తనకు కరోనా వైరస్ సోకిందంటూ… తేలికపాటి లక్షణాలు కనిపించగా వైద్య నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పాజటివ్ రావడంతో వైద్యులను సంప్రదించినట్లు తెలిపారు.
గత మూడు రోజులుగా తనను కలిసిన మిత్రులు, శ్రేయోభిలాషులందరూ దయ చేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆమె కోరారు. హోం ఐసోలేషన్ లో ఉన్నానంటూ ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకుని.. మాస్కులు, భౌతిక దూరం వంటి నియమాలను పాటించాలని కోరారు.

Actress keerthy suresh tested COVID positive
ఇదిలా ఉండగా భారత్ లో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కూడా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఇటీవల.. సినీ , రాజకీయ ప్రముఖులు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్నారు.