shriya saran : జంపింగ్ జంపాగ్ అనేలా హీరోయిన్ రచ్చ.. బిడ్డను వెరైటీగా ఆడిస్తోన్న శ్రియా
shriya saran : హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న హీరోల నుంచి మొదలుకుని.. స్టార్ హీరోల వరకు అందరితోనూ నటించింది ఈ భామ. 2018లో తన ప్రియుడు.. రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ.. అప్పట్నుంచి ఆయనతో కలిసి ఫుల్లుగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. అప్పటి నుంచి కొద్దిగా సినిమాలు చేయడం తగ్గించింది. అయితే తన లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందజేస్తుంది. అయితే ఇటీవల ఆమె వెల్లడించిన ఓ విషయం మాత్రం అభిమానులకు విస్మయానికి గురిచేసిన సంగతి తెలిసిందే.

actress shriya saran playing with daughter in funny way
అయితే తాను గర్భం దాల్చిన విషయం, బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచింది. అంటే ఏడాది కాలంగా ఆ విషయాన్ని అభిమానులకు తెలియకుండా చూసింది. కొద్ది వారాల క్రితమే తన బిడ్డను అభిమానులకు పరిచయం చేయింది. పాపకు రాధా అనే పేరు పెట్టినట్టుగా చెప్పింది శ్రియ. తన భర్తది రష్యా అని.. రష్యన్‌లో రాధా అంటే సంతోషం అని అర్థం వస్తుందని అందుకే పాపకు ఆ పేరు పెట్టినట్టుగా వెల్లడించింది.
shriya saran : తల్లిగా మురిసిపోతోన్న శ్రియా సరన్

Shriya Saran Got Pregnant
ఇక, తాను తల్లి అయినట్టుగా వెల్లడించిన శ్రియ.. ఇప్పుడు పాపతో కలిసి ఆడుకుంటున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. అందులో శ్రియా తన బిడ్డను చాలా వెరైటీగా ఆడిస్తోంది. కింద పడుకున్న శ్రియా.. పాపను తన నుడుముపై కూర్చొబెట్టుకుంది. ఆ తర్వాత స్ప్రింగ్ రియాక్షన్స్ ఇచ్చింది. జంపింగ్ జంపాగ్ అనేలా రచ్చచేసింది. ఈ విధంగా పాపను ఆడించింది. ఈ వీడియో చూసిన చాలా మంది క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.