Adipurush Movie : విడుదల కి ముందరే భారీ రికార్డ్ కొట్టేసిన ఆది పురుష్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Adipurush Movie : విడుదల కి ముందరే భారీ రికార్డ్ కొట్టేసిన ఆది పురుష్ !

 Authored By aruna | The Telugu News | Updated on :10 June 2023,12:00 pm

Adipurush Movie : పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భారత ఇతిహాసం రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్ నటించారు. ఇక రావణాసురుడిగా బాలీవుడ్ యాక్టర్ రన్వీర్ సింగ్ నటించారు. ఇక ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ రావణాసురుడిపై చేసే యుద్ధ విన్యాసాలు హైలెట్ గా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.

ఈ ట్రైలర్స్ తో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ప్రభాస్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఆదిపురుష్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ కూడా ఈ సినిమా రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇండియాలో హైయెస్ట్ బిజినెస్ జరిగిన సినిమాగా ఆది పురుష్ నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే మరో కొత్త రికార్డు సృష్టిస్తుంది. ఇంతవరకు ఏ స్టార్ హీరో కొట్టాలని రికార్డ్ ను ప్రభాస్ కొట్టబోతున్నాడని తెలుస్తుంది. సాహో సినిమా మొదటి రోజు 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

Adipurush Movie break the records before release

Adipurush Movie break the records before release

అలాగే రాధేశ్యామ్ కూడా మొదటి రోజు 100 కోట్లు సాధించింది. కానీ తర్వాత రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆది పురుష్ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా కనుక హిట్టయితే ఆదిపురుష్ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. భారీ అంచనాలతో విడుదల కాబోతున్న ఈ సినిమా ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. మరి ముఖ్యంగా ప్రభాస్ రాముడిగా ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది