Adipurush Movie Review : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Adipurush Movie Review : ప్రభాస్ ఆదిపురుష్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By kranthi | The Telugu News | Updated on :15 June 2023,11:22 pm

Adipurush Movie Review : యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas నటించిన సినిమా పేరు ఆది పురుష్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న విడుదల అయింది. ఈసందర్భంగా ఇప్పటికే యూఎస్ లో బెనిఫిట్ షోలు వేశారు. మన దగ్గర ఉన్న బెనిఫిట్ షోలు అయ్యాయి. దీంతో సినిమా ఎలా ఉందో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు రివ్యూల మీద రివ్యూలు ఇస్తున్నారు. అయితే.. ఈ సినిమా గురించి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ఒక ఇతిహాసం. కొత్తగా సృష్టించిన కథ కాదు. శ్రీరాముడి కథ. రామాయణాన్ని మళ్లీ తెర మీద చూసే అవకాశం ఇలా ఆదిపురుష్ ద్వారా ప్రేక్షకులకు లభించింది.

ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ నటించగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా ఫేమస్ స్టార్లు. ఈ సినిమాలో చాలామంది టాప్ స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై విపరీతంగా హైప్ పెరిగింది. అలాగే.. ఈ సినిమాను ప్రత్యేకమైన టెక్నాలజీతో రూపొందించారు. త్రీడీ వర్షన్ లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు.

Adipurush Movie Review and rating in telugu

Adipurush Movie Review and rating in telugu

Adipurush Movie Review సినిమా పేరు: ఆది పురుష్

నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహాన్, తృప్తి తోరదమల్

డైరెక్టర్: ఓం రౌత్

నిర్మాతలు : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్

మ్యూజిక్ డైరెక్టర్స్ : సంచిత బల్హారా, అంకిత్ బల్హారా

సాంగ్స్ : అజయ్ అతుల్, సాఛేత్ పరంపర

సినిమా నిడివి : 179 మినట్స్

Adipurush Movie Review: కథ

ఈ సినిమా కథ ఏంటంటే.. దశరథ మహారాజు(ప్రభాస్)కి వృద్ధాప్యం మీదపడుతుంది. దీంతో తన పెద్దకొడుకు రాఘవ్(ప్రభాస్)ను అయోధ్య నగరానికి మహారాజును చేయాలని భావిస్తాడు. కానీ.. అందుకు రాఘవ్ సవితి తల్లి కైకేయి ఒప్పుకోదు. తన కొడుకు భరతుడికే పట్టాభిషేకం చేయాలని అంటుంది. అంతే కాదు.. తన కొడుకు భరతుడిని పట్టాభిషేకం చేశాక.. రాఘవ్ ఇక్కడ ఉండొద్దని.. 14 ఏళ్లు వనవాసం చేయాలని పట్టుబడుతుంది. దీంతో దశరథ మహారాజు మాట కోసం రాఘవ్ తన భార్య జానకి(కృతి సనన్)ను తీసుకొని వనవాసానికి వెళ్తాడు.

అక్కడే కొన్నేళ్లు వాళ్లు ఉంటారు. ఆ తర్వాత లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) చెల్లెలు సూర్పనక.. రాఘవ్ తమ్ముడు లక్ష్మణ్ ను కోరుకుంటుంది. కానీ.. లక్ష్మణ్ కు అది ఇష్టం ఉండదు. దీంతో లక్ష్మణ్ పై ఆమె దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. దీంతో లక్ష్మణ్.. సూర్పనక ముక్కు కోస్తాడు. ఆ విషయం తెలుసుకున్న లంకేశ్.. తన చెల్లె ముక్కు కోస్తాడా అన్న ఆగ్రహంతో జానకి దగ్గరికి ఒక భిక్షువు రూపంలో వచ్చి ఆమెను అపహరించుకొని లంకకు తీసుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన రాఘవ్.. జానకిని తిరిగి తీసుకొని రావడానికి అష్టకష్టాలు పడతాడు. జానకిని తన దగ్గరికి చేర్చేందుకు.. రాఘవ్ కు హనుమాన్, వానర సైన్యం సాయం చేస్తుంది. వాళ్లు ఎలా రాఘవ్ కు సాయం చేశారు. జానకిని తిరిగి రాఘవ్ ఎలా తన దగ్గరకు తీసుకురాగలిగాడు. లంకేశ్ తో యుద్ధం ఎలా చేశాడు.. అనేదే మిగితా కథ.

విశ్లేషణ

ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు విజువల్స్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే.. ఈ సినిమా కథ అందరికీ తెలిసిందే. కానీ.. విజువల్ వండర్ అని చెప్పుకోవాలి. త్రీడీ ఎఫెక్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఆడియెన్స్ కు ఏదో ఒక లోకంలో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాగే.. మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతం అనే చెప్పుకోవాలి. వీఎఫ్ఎక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని సీన్లు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

ప్లస్ పాయింట్స్

ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్

వాలీ, సుగ్రీవుడి యుద్ధం సన్నివేశాలు

శుర్పనక సీన్

రాఘవ్, ఖారా ఫైట్

బజరంగ్ లంక ఫైర్

బ్రిడ్జి కట్టే సీన్లు

మైనస్ పాయింట్స్

రావణాసురుడి పది తలలు చూపించడం

రాముడి పేరు ఎత్తకపోవడం

క్యారెక్టర్ల పేర్లు మార్చడం

ది తెలుగు న్యూస్ రేటింగ్ : 2.75/5

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది