Chiranjeevi : అక్కినేని తర్వాత.. ఆ ఘనత సాధించింది ఒక్క మెగాస్టారే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi : అక్కినేని తర్వాత.. ఆ ఘనత సాధించింది ఒక్క మెగాస్టారే..!

 Authored By aruna | The Telugu News | Updated on :27 January 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Chiranjeevi : అక్కినేని తర్వాత.. ఆ ఘనత సాధించింది ఒక్క మెగాస్టారే..!

Chiranjeevi : గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అను ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలలో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. అయితే తాజాగా ప్రకటించిన అవార్డులలో దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ తెలుగు రాష్ట్రాలలో ఇద్దరిని వరించింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు అవార్డును ప్రకటించింది కేంద్రం. దీంతో వీరిద్దరికి సోషల్ మీడియా వేదికగా సినీ రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి.

అయితే ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో పద్మ విభూషణ్ కేవలం ఒక్క హీరోకు మాత్రమే వచ్చింది. ఆ తర్వాత ఈ అవార్డు అందుకునే హీరో మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవికి ముందు పద్మ విభూషణ్ అందుకున్నది నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. 2011లో అక్కినేని నాగేశ్వరరావుకు పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ అవార్డు వరించింది. దశాబ్దాల సినీ తెలుగు చరిత్రలో పద్మ విభూషణ్ అవార్డు ఇద్దరికి మాత్రమే దక్కింది. భాషతో సంబంధం లేకుండా సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులకు అవార్డులు అందుకున్నారు.

వారిలో సినీ రంగంలో ప్రస్తుతం వీరిద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వెంకయ్య నాయుడు చిరంజీవిని కలిసి శాలువా కప్పి గౌరవించారు. పద్మ విభూషణ్ అందుకోబోతున్న నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. వెంకయ్య నాయుడు కూడా చిరంజీవికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆయనకు మెడలో ఉత్తరీయం వేసి సన్మానించారు. చిరంజీవికి కూడా కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించడం పట్ల వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ఎక్స్ లో పంచుకున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది