Anchor Suma : జయమ్మ పంచాయితీ సక్సెస్ అయితే యాంకర్‌ సుమ ‘క్యాష్‌’ వదిలేస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Suma : జయమ్మ పంచాయితీ సక్సెస్ అయితే యాంకర్‌ సుమ ‘క్యాష్‌’ వదిలేస్తుందా?

Anchor Suma : యాంకర్‌ సుమ నటి సుమగా మారింది. జయమ్మ పంచాయితీ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. సుమ గతంలో నటిగా బుల్లి తెర మరియు వెండి తెరపై పలు సినిమాల్లో కనిపించింది. ఆ విషయంలో చాలా మందికి తెలియదు. ఆమె ను ఇప్పటి యూత్ చిన్నప్పటి నుండి కూడా టీవీలోనే చూశారు. ఇప్పుడు వారు వెండి తెరపై ఆమెను చూడబోతున్నారు. జయమ్మ పంచాయితీ సినిమా తో సుమ వెండి తెరపై […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 May 2022,9:00 pm

Anchor Suma : యాంకర్‌ సుమ నటి సుమగా మారింది. జయమ్మ పంచాయితీ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. సుమ గతంలో నటిగా బుల్లి తెర మరియు వెండి తెరపై పలు సినిమాల్లో కనిపించింది. ఆ విషయంలో చాలా మందికి తెలియదు. ఆమె ను ఇప్పటి యూత్ చిన్నప్పటి నుండి కూడా టీవీలోనే చూశారు. ఇప్పుడు వారు వెండి తెరపై ఆమెను చూడబోతున్నారు. జయమ్మ పంచాయితీ సినిమా తో సుమ వెండి తెరపై సూపర్‌ క్రేజ్ తో అరంగేట్రంకు సిద్దం అయ్యింది.సుమ వయసుకు తగ్గ పాత్ర తో జయమ్మ పాత్రలో కనిపించబోతుంది.

సినిమాలో ఆమె ఒక పల్లెటూరుకు చెందిన మహిళగా కనిపించబోతుంది. జయమ్మ పంచాయితీ సినిమా సక్సెస్ అయితే ఆమెతో నటించేందుకు చాలా మంది స్టార్‌ హీరోలు సిద్దంగా ఉన్నారు. ఆమెకు తమ సినిమాల్లో కీలక పాత్రలను ఆఫర్‌ చేస్తూ చాలా మంది క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమె కనుక ఓకే అనాలే కాని ఒకే సారి పది సినిమాల ఆఫర్‌ లు ఆమె ముందు ఉండే అవకాశాలు లేకపోలేదు.సుమ కు ఒక స్టార్‌ హీరో హీరోయిన్‌ రేంజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

after jayamma panchayithi movie Anchor Suma quit cash show

after jayamma panchayithi movie Anchor Suma quit cash show

అలాంటి సుమ నటిగా బిజీ అయితే ఆమె చేస్తున్న కార్యక్రమాల పరిస్థితి ఏంటీ అంటూ ఇప్పుడు అభిమానుల్లో చర్చ మొదలు అయ్యింది. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న క్యాష్ కార్యక్రమం జయమ్మ పంచాయితీ సినిమా తర్వాత కనిపించకుండా పోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ షో కు ఇప్పటికి మంచి ఆధరణ ఉంది. సెలబ్రెటీలతో సుమ చేసే సందడిని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాంటి షో ను సుమ మానేసి సినిమాలతో బిజీ అవుతుందనే పుకార్లు వస్తున్నాయి. కాని సుమ అభిమానులు మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. సుమ మరో పదేళ్ల పాటు ఆ షో చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది