Taraka Ratna : ఫిలింనగర్ లో తారకరత్న పార్థివ దేహం పెట్టిన సమయంలో ఒక్కసారిగా బాలకృష్ణ మీదకి వచ్చినా అఘోర వీడియో వైరల్..!!
Taraka Ratna : ఫిబ్రవరి 18వ తారీకు నందమూరి తారకరత్న మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు 23 రోజులపాటు బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చావుతో పోరాడిన తారకరత్న మరణించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. అయితే తారకరత్ననీ బతికించుకోవడానికి బాలకృష్ణ అనేక ప్రయత్నాలు చేశారు. బెంగళూరులో తారకరత్నకీ అత్యాధునిక చికిత్స అందించడంతోపాటు విదేశీ వైద్యులను కూడా తెప్పించి మరి.. ఎలాగైనా బతికించాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారు. కానీ తారకరత్న ప్రాణాన్ని కాపాడుకోలేకపోయారు.
కాగా శనివారం రాత్రి తారకరత్న మరణ వార్త కన్ఫామ్ చేయగా అదే రోజు రాత్రి… బెంగళూరు నుండి హైదరాబాద్ కి భౌతికకాయాన్ని తరలించారు. ఆదివారం మొత్తం తారకరత్న స్వగృహంలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. ఇక సోమవారం ఫిలింనగర్ లో అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతికకాయాన్ని తరలించడం జరిగింది. ఈ క్రమంలో తారకరత్న భౌతికకాయం వద్దకి చాలామంది అభిమానులతో పాటు ఓ అఘోర వచ్చాడు. అతడు ఏకంగా బాలకృష్ణ మీదకు వెళ్ళిపోయి వేలు చూపిస్తూ…

Aghora Giving Warning To Balakrishna For Taraka Ratna
ఏదో వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలకృష్ణతో ఆ అఘోర మాట్లాడుతున్న సమయంలో పక్కనే తారకరత్న తండ్రి కూడా నిలబడి షాక్ అయిపోయాడు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి ఆ అఘోరాన్ని బయటకు తరలించారు. సోమవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరిగాయి. తారకరత్నకీ కడసారి నివాళి అర్పించడానికి భారీ ఎత్తున అభిమానులు… కుటుంబ సభ్యులు అంతిమయాత్రలో పాల్గొనడం జరిగింది.