Most Eligible Bachelor Movie Review : మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ రివ్యూ, లైవ్ అప్‌డేట్స్..!
Most Eligible Bachelor Movie Review : అఖిల్ అక్కినేని ఒక్క హిట్టు కొట్టలేకపోతోన్నాడు. అక్కినేని అభిమానులకు అదే ఓ తీరని బాధలా మారిపోయింది. ఇప్పటి వరకు చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టాయి. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా అన్నీ కూడా ఫ్లాప్‌గా మిగిలాయి. ఇక సక్సెస్ చూసి ఎంతో కాలమైన బొమ్మరిల్లు భాస్కర్‌తో అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అంటూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Most Eligible Bachelor Review and live updates
కొందరు ఈ చిత్రం బాగుందని అంటే.. ఇంకొందరు మాత్రం దారుణమని కామెంట్లు పెడుతున్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు.. కానీ ద్వితీయార్థం మాత్రం దొబ్బేసిందని అంటున్నారు. సినిమాలో మొత్తంగా పూజా హెగ్డే, పాటలు అదిరిపోయాయని అంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ఈ చిత్రం ఒక్కసారి చూడొచ్చు అని సలహాలు ఇస్తున్నారు.
Most Eligible Bachelor Movie Review : మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌పై చర్చలు..

Most Eligible Bachelor Review and live updates
మొత్తానికి అఖిల్‌కు ఈ బ్యాచ్‌లర్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ఇప్పుడు అయితే ట్విట్టర్‌లో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఇంకొద్ది సేపు ఆగితే పూర్తి రివ్యూలు మన ముందుకు వచ్చేస్తాయి. బ్యాచ్‌లర్ సినిమా అఖిల్‌కు ప్లస్ అవుతుందా? బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ హిట్ వచ్చిందా? అనే విషయం తెలుస్తోంది. మొత్తానికి ట్విట్టర్‌లో మాత్రం అఖిల్ జోరు కనిపిస్తోంది.
పూర్తి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి