Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తో ఎందుకు చేయట్లేదు.. అలి చెప్పిన కాకరకాయ ముచ్చట్లు.. ఆడియన్స్ అంత బకరాళ్లా కనిపిస్తున్నారా సారూ..?
Pawan Kalyan : ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో కమెడియన్ అలి ఖచ్చితంగ ఉండే వాడు. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ సూపర్ గా ఉంటాయి. పవన్ ప్రత్యేకించి ప్రతి సినిమాలో అలికి మంచి పాత్ర పడేలా చేశాడు. అయితే ఇది ఒకప్పటి మాట ఇప్పుడు పవన్ సినిమాల్లో అలికి నో ఛాన్స్. ఇలా సీన్ ఎందుకు రివర్స్ అయ్యింది అంటే అలి వైసీపీలో చేరడమే అని అంటున్నారు. సరే పార్టీలో చేరడం వరకు ఓకే కానీ పవన్ పై అప్పట్లో కొన్ని నెగటివ్ కామెంట్స్ చేశాడు.
చిరు వేసిన పూల బాటలో పవన్ నడిచాడు. కానీ తను స్వశక్తితో ఎదిగానని అన్నారు. అవి అప్పుడు పీకే ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేశాయి. ఆ టైం లో అలిని కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏసుకున్నారు. ఇదిలాఉంటే ఇప్పుడు అలి మళ్లీ పవన్ కి దగ్గరవ్వాలని చూస్తున్నాడు. తను చేస్తున్న అలితో సరదాగా షోకి కూడా పవర్ స్టార్ ని పిలిచే ఏర్పాట్లు చేస్తున్నారట. ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నాడని అలి అంటున్నారు.

Ali Cleares why he is not sharing screen with Pawan Kalyan
అంతేకాదు పవన్ తీసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్లో తనకు తగిన కామెడీ రోల్ లేదని ఆ సినిమాల్లో తాను లేనని కామెడీ రోల్ అయితే పవన్ తనని ఖచ్చితంగా పిలుస్తారని అంటున్నాడు. రాజకీయాల పరంగా వైసీపీ అంటేనే అగ్గిమీద గుగ్గీలవుతున్న పవన్ మరి ఆ పార్టీ కార్యకర్త ప్రస్తుతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడు అయిన అలికి ఛాన్స్ ఇస్తారంటారా..? ఏమో డౌటే కానీ అలి మాత్రం ఆడియన్స్ ని బకరా చేఏస్తూ అవేవో కాకరాకాయ ముచ్చట్లు చెబుతున్నాడు.