Allu Aravind : ఆయన కోసం 12 ఏళ్లు పోరాటం చేశా.. వాళ్లను జైలుకు పంపా చిరంజీవి పై అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు..!!

Advertisement

Allu Aravind : మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ ఆగస్టు 11 వ తారీకు విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా తమన్నా హీరోయిన్ గా నటించగా.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. అక్కినేని సుశాంత్ కూడా కీరోల్ ప్లే చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాతలు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఎన్నో పెద్ద పెద్ద సినిమాలతో అనేక విజయాలు తన ఖాతాలో వేసుకున్న చిరంజీవికి ఈ సినిమా కూడా అదే రీతిలో విజయం సాధించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. చిరంజీవిపై నాకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన చేసినా కొన్ని మంచి పనుల గురించి నీచంగా మాట్లాడి.. ఒకరు ఆరోపణలు చేశారు. వారిపై 12 సంవత్సరాలు నుంచి పోరాడి.. వాళ్లని జైలుకు పంపించేంతవరకు వదల్లేదు అంటూ.. చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని అల్లు అరవింద్ చాటుకున్నారు.

Advertisement
allu aravind bhola shankar pre release event
allu aravind bhola shankar pre release event

2009 ఎన్నికల సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గురించి హీరో రాజశేఖర్ జంట కామెంట్లు చేయడం జరిగింది. ఈ విషయంపై అల్లు అరవింద్ న్యాయస్థానంలో పోరాడి వాళ్లకు శిక్ష పడేలా చేశారు. ఈ శిక్షకు సంబంధించిన తీర్పు కొన్ని వారాల క్రితం వెలువడింది. ఈ క్రమంలో “భోళా శంకర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Advertisement
Advertisement