Dammunte Pattukora Song : దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్… ఈ టైమ్‌లో అవసరమా బన్నీ..!
ప్రధానాంశాలు:
Dammunte Pattukora Song : దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్... ఈ టైమ్‌లో అవసరమా బన్నీ..!
Dammunte Pattukora Song : హైదరాబాద్‌లోని సంధ్యాథియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం అల్లు అర్జున్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఈ కేసులో భాగంగా బన్నీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి మరుసటి రోజు విడుదల చేశారు. అయితే ఈ కేసులో పలువురిని పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. మరోసారి అల్లు అర్జున్‌ను మంగళవారం విచారించారు.ఈ విచారణలో అల్లు అర్జున్‌పై పోలీసులు ప్రశ్నలవర్షం కురిపించారు. మూడు గంటల 35 నిమిషాలు అల్లు అర్జున్‌ని పోలీసులు విచారించారు. పోలీస్ ప్రశ్నలకు కొన్నింటికి అల్లు అర్జున్ సమాధానం చెప్పగా, మరి కొన్ని ప్రశ్నలకు తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటిగా ఉన్ననందున అర్ధం కాలేదని సమాధానమిచ్చినట్టు సమాచారం.
Dammunte Pattukora Song లేని పోని సమస్యలు ఎందుకు..
అయితే పుష్ప2 కోసం బన్నీ ఇంత కష్టపడి పని చేసిన ఇప్పుడు సంధ్యా థియేటర్ కేసు మాత్రం బన్నీని ఇబ్బందుల్లో పడేసింది. అయితే ఈ మధ్య పుష్ప2 సినిమాకి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా షెకావత్ తో సవాలు చేసి.. పుష్ప ఓ పాట పాడతాడు. నాలుగు లైన్స్ ను వార్నింగ్ చెప్పినట్లు చెప్తాడు. దమ్ముంటే పట్టుకోరా షెకావత్ .. పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. మళ్లీ భుజాన గొడ్డలేసి.. కూలీగా పోతాను నేను అడివికేసి. ఈ లైన్స్ ను రైమింగ్ లో పాడుతూ మిగతావారితో పాడిస్తాడు పుష్ప. ఇప్పుడు ఆ నాలుగు లైన్స్ కు డీజే మిక్స్ చేసి సాంగ్ లా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ సాంగ్ పైనే అందరి చూపు.
ఇక అల్లు అర్జున్ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఈ సాంగ్ ను రిలీజ్ చేసారని నెటిజన్స్ మాట్లాడుకుంటుంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి సాంగ్ రిలీజ్ చేసి ట్రోలర్స్ ను రెచ్చగొట్టడం దేనికి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. యూట్యూబ్‌లో సాంగ్ రిలీజైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్‌లతో దూసుకుపోతుంది. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. అలాగే జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు కీ రోల్స్ పోషించారు. ఇక డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఒక స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది..