Ram Charan : రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ విలువైన బహుమతి .. గిఫ్ట్ చూసి ఏడ్చేసిన ఉపాసన ..

Advertisement

Ram Charan : సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిరంజీవితో మొదలైన ఆ క్రేజ్ ఆయన వారసులు కూడా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. ప్రస్తుతం యంగ్ హీరోలలో ఆయన కొడుకు రామ్ చరణ్ కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. తండ్రికి తగ్గ తనయుడు గా మంచి పేరు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్ ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు.

Advertisement

ఆ తర్వాత రామ్ చరణ్ వరుస సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసనల వివాహం జరిగి దాదాపుగా 11 ఏళ్లు అవుతుంది. అయితే వాళ్లు చాలా ఆలస్యంగా తల్లిదండ్రులు అయ్యారు. ఇటీవల ఉపాసన ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీంకారా అని నామకరణం కూడా చేశారు. చాలా ఏళ్ల తర్వాత సంతానం కలగడంతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు నెలకొన్నాయి. ఉపాసన ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇక ప్రస్తుతం ఆ పాప పుట్టాక నామకరణం చేశాక కూడా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Advertisement
Allu Arjun gift to Ram Charan daughter
Allu Arjun gift to Ram Charan daughter

అయితే రామ్ చరణ్ ఉపాసనల బిడ్డకు చాలామంది సెలబ్రిటీలు వివిధ రకాల బహుమతులు పంపించారు. ఇప్పటికీ పంపిస్తూనే ఉన్నారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కూతురికి విలువైన బహుమతి ఇచ్చారు. క్లీంకారాకు అల్లు అర్జున్ దంపతులు నేమ్ ప్లేట్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. అయితే ఆ నేమ్ ప్లేట్ పై క్లీంకారా అక్షరాలు బంగారంతో చేశారట. అలాగే చుట్టూ డైమండ్స్ పొదిగి ఉన్నాయట. క్లీన్ కారకు చాలామంది ఎన్నో బహుమతులు ఇచ్చారు కానీ అల్లు అర్జున్ ఇచ్చిన బహుమతి చాలా స్పెషల్ గా ఉందని అంటున్నారు.

Advertisement
Advertisement