Ram Charan : జైలుకెళ్లిన అల్లు రామలింగయ్య.. ఎవ్వరికీ తెలియని రహస్యం బయటపెట్టిన రామ్ చరణ్..!
Ram Charan : తెలుగు భాషతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. జూ. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 7న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతున్నారు. ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో హీరో రామ్ చరణ్ ఓ ఆసక్తి కరమైన విషయం చెప్పారు.
తన తాత అల్లు రామలింగయ్య గురించిన ఈ కామెంట్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఆర్ ఆర్ ఆర్ చిత్ర ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాత అల్లు రామలింగయ్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చెప్పారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని చెప్పిన చరణ్.. అప్పట్లో ఆయన పేద వర్గాలకు అనుకూలంగా వారి హక్కులపై పోరాటం చేశారని తెలిపారు. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసునని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ పోరాటంలో ఆయన జైలు పాలు కూడా అయ్యారని అన్నారు. అల్లు రామలింగయ్య ను 15 రోజులకు పైగా జైలులో ఉంచారంటూ..

Allu Ramalingaiah jailed Ram Charan reveals a secret unknown to anyone
Ram Charan : అల్లు రామలింగయ్య తాతను జైల్లో పెట్టారు..!
ఆ విషయం తన కుటుంబ సభ్యుల్లో కూడా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఇన్ని రోజులు ఎవరికి తెలియని విషయం బయట పెట్టారు.టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించగా.. తారక్ కొమురం భీం పాత్రలో నటించారు. జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర బృందం దేశంలోని ప్రధాన నగరాలను చిత్ర ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.