Allu vs Mega : అల్లు వ‌ర్సెస్ మెగా.. ఈ వార్ అందుకోస‌మేనా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Allu vs Mega : అల్లు వ‌ర్సెస్ మెగా.. ఈ వార్ అందుకోస‌మేనా ?

 Authored By ramu | The Telugu News | Updated on :27 August 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Allu vs Mega : అల్లు వ‌ర్సెస్ మెగా.. ఈ వార్ అందుకోస‌మేనా ?

Allu vs Mega : మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకి మరింత ముదురుతుండడం మ‌నం చూస్తూ ఉన్నాం. మెగా అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేసుకుంటున్నారు.గత కొంతకాలంగా మెగా అభిమానులు అల్లు అర్జున్ మీద పగ పట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మాట్లాడే ప్రతి చిన్న మాట మీద ట్రోల్ చేస్తూ మెగా ఫాన్స్ ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ వైసీపీ నాయకుడికి మద్దతు పలకడం అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే మెగా అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అంటూ.. ఎప్పటినుంచి పుకార్లు వినిపిస్తూనే వచ్చాయి.

Allu vs Mega అస్థిత్వం కోస‌మేనా ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మీ అందరికీ ఎవరికీ తెలియని ఒక విషయం చెబుతాను అని చెప్పినా కూడా మెగా ఫాన్స్ ఏమాత్రం వినకుండా స్టేజ్ మీద నుంచి వెళ్ళిపొమ్మన్నట్లు సైగలు చేస్తారు. అప్పుడు అల్లు అరవింద్ ని.. తీవ్రంగా అవమానించారు అంటూ అల్లు అభిమానులు హర్ట్ అయ్యారు. అప్పుడే అల్లు అర్జున్ కూడా హర్ట్ అయ్యారు అని.. తన తండ్రిని అవమానించిన మెగా అభిమానులకు విషయంలో కోపం తెచ్చుకున్నారు అని అల్లు ఫాన్స్ చెబుతున్నారు. మెగా ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన పుట్టిన రోజు సందర్బంగా అల్లు అర్జున్ , ఆయన భార్య స్నేహారెడ్డి ఎవరూ స్పందించలేదు.

Allu vs Mega అల్లు వ‌ర్సెస్ మెగా ఈ వార్ అందుకోస‌మేనా

Allu vs Mega : అల్లు వ‌ర్సెస్ మెగా.. ఈ వార్ అందుకోస‌మేనా ?

ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్.. ‘మై డియర్‌ ఫ్యాన్స్‌.. మీరే నా ఆర్మీ, నా ఫ్యాన్స్‌ అంటే నాకు పిచ్చి. హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్‌ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్‌ని చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లయినా మీరు చూపే ప్రేమ అస్సలు తగ్గలే. నన్ను ప్రేమించే వాళ్ల కోసం నిలబడగలగాలి. మన అనుకున్న వాళ్ల కోసం ఎంత వరకైనా వెళ్తా.. అది మీ అందరికి తెలుసంటూ కామెంట్ చేశారు. ఈ ఒక్క మాటతో మెగా ఫ్యామిలీతో తనకున్న బంధాన్ని తేల్చేసినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టం అవుతోంది. అల్లు ఫ్యామిలీ అస్తిత్వం కోస‌మే ఆయ‌న ట్రై చేస్తున్న‌ట్టు ప్ర‌చారం న‌డుస్తుంది.ఇందుకే అల్లు స్టూడియోతో పాటు థియేట‌ర్స్ ఇలా అల్లు పేరుని మ‌రింత మారుమ్రోగేలా చేస్తున్నాడ‌ని అంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది