Amala : సమంత, నాగచైతన్య డైవోర్స్ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియాతో అమల..
Amala Akkineni : అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. అయితే, వీరిరువురు విడిపోవడం చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులకు నచ్చలేదు. వారు కలిసే ఉండాలని దాదాపుగా అందరూ కోరుకున్నారు. కానీ, అలా జరగలేదు. అయితే, సమంత, నాగచైతన్య విడిపోవడం వార్త తెలుసుకుని తన గుండె బరువెక్కిందని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు. అయితే, నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన తర్వాత అమల మీడియా మందుకు రాలేదు. తాజాగా అక్కినేని అమల మీడియాతో మాట్లాడారు.ఇటీవల దసరా సందర్భంగా డాక్టర్ మోహన్ అట్లూరి హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో వరల్డ్ క్లాస్ డిజిటల్ డెంటిస్ట్రీని ఏర్పాటు చేయగా, దాని ప్రారంభోత్సవానికి అక్కినేని దంపతులు అమల-నాగార్జున హాజరయ్యారు.

amala media talk after naga chaitanya samantha divorce
అంతకు ముందర సినీ తారలకు పళ్లు ఎంత ముఖ్యమనే విషయమై వివరించారు. సిల్వర్ స్క్రీన్‌పైన సినీ తారలు నవ్వే సమయంలో పళ్లు స్పష్టంగా కనబడతాయని, ఆ సందర్భంలో వాటిని చక్కగా ఉంచుకోవడం ముఖ్యం. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ తారల చిరునవ్వుల వెనక స్టార్ డాక్టర్ మోహన్ అట్లూరి ఉన్నారని పలువురు తెలిపారు. అక్కినేని అమల ఈ సందర్భంగా మాట్లాడుతూ తనతో పాటు చాలా మంది సినీ తారల దంత వైద్యుడు డాక్టర్ మోహన్ అట్లూరి అని తెలిపారు. తాను పదేళ్ల వయసులో ఉన్నపుడు సుల్తాన్ బజార్‌లోని డాక్టర్ మోహన్ ఫాదర్ పద్మశ్రీ డాక్టర్ ఏ.ఎస్.నారాయణ క్లినిక్‌కు సైకిల్‌పైన వెళ్లేదానినని గుర్తు చేసుకుంది. ఈ క్రమంలోనే తమ ఫ్యామిలీ డాక్టర్ మోహన్ అట్లూరి అని చెప్పింది. డిజిటల్ డెంటిస్ట్రీ అనేది దంతవైద్యం ఫ్యూచర్ అని వివరించింది.
Amala : ఆయన సినీ తారల ఫేవరెట్ అంటున్న అమల అక్కినేని..

amala media talk after naga chaitanya samantha divorce
ఇక డాక్టర్ మోహన్ అట్లూరి మాట్లాడుతూ డిజిటల్ డెంటిస్ట్రీ కచ్చితమైన, సమర్థవంతమైన టెక్నాలజీ అని చెప్పారు. అక్కినేని అమల నాగార్జునతో మ్యారేజ్ తర్వాత సినిమాల్లో నటించలేదు. అయితే, చాలా కాలం తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంలో కేన్సర్ పేషెంట్‌గా నటించింది. ఇక ‘మనం’ సినిమాలో డ్యాన్స్ టీచర్‌గా కనిపించిన అమల ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
