Amala Paul : కొంటెచూపుతో కవ్విస్తోన్న అమలా పాల్.. న్యూ ఔట్ ఫిట్‌లో అందాల విందు!
Amala Paul : వయస్సు పెరుగుతున్నా అమలాపాల్ అందం ఏమాత్రం చెక్కుచెదరడం లేదు. రోజురోజుకూ మరింత యవ్వనంగా కనిపిస్తోంది. మొన్నటివరకు బొద్దుగా కనిపించిన ఈ భామ ప్రస్తుతం స్లిమ్‌గా తయారైంది. అమలాపాల్ తన నటన, గ్లామర్ షోతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమలా చేసింది తక్కువ సినిమాలే అయినా ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు చేయడం మానేసింది. అయితే, ఆఫర్లు రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.అమలాపాల్ ప్రేమఖైదీ డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయమైంది. ఆ తర్వాత ‘నిరంతరం నీ ఊహలే’వంటి మరో డబ్బింగ్ సినిమా చేసినా అవి అమలకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.
వివి వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ సరసన ‘నాయక్’మూవీలో అమలాపాల్ సెకండ్ హీరోయిన్‌గా నటించి అందరి మెప్పించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అయినా, ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో వెంటనే చైన్నైకు మకాం మార్చినట్టు తెలిసింది. కెరీర్ ప్రారంభంలో నటనకు ప్రాధాన్యం ఉన్న మూవీలు చేసిన పాల్.. ఆ మధ్యలో బోల్డ్ సినిమాలకు కూడా ఓకే చెప్పేసింది. ‘ఆమె’ సినిమాలో ఏకంగా నగ్నంగా నటించి అందరినీ షాక్‌కు గురిచేసింది.

Amala paul Latest Pics Viral
Amala Paul : గ్లామర్ షోకు కేరాఫ్ అమలాపాల్
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమలాపాల్ ఖాళీ టైంలో ఫోటో షూట్ చేసి పిక్చర్స్‌ను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోస్‌లో అమలా కొత్త దుస్తుల్లో మెరిసిపోతుంది. డిజైన్డ్ పసుపు మరియు నల్లరంగులో ఉన్న ఔట్ ఫిట్ ధరించి తన నడుము, ఎద అందాలతో కుర్రకారును మత్తెక్కిస్తోంది. అమలా పాల్ కొంటె చూపులతో కవ్విస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.