Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెట‌ర్‌నే ప‌ట్టుకొస్తున్నారా..ఇక నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెట‌ర్‌నే ప‌ట్టుకొస్తున్నారా..ఇక నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 July 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెట‌ర్‌నే ప‌ట్టుకొస్తున్నారా..ఇక నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్..!

Ambati Rayudu : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్ర‌స్తుతం ఈ కార్య‌క్ర‌మం తెలుగులో సక్సెస్ ఫుల్‌గా న‌డుస్తుంది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8 కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. ఆగస్టులో.. మస్ట్ మజా ఎంటర్టైన్‌మెంట్ షురూ అవ్వొచ్చు. అయితే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్‌ల‌కి సంబంధించి నిత్యం నెట్టింట అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి బిగ్ బాస్ టీమ్.. ఆచి తూచి.. కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఊహించని రీతిలో ఏకంగా ఓ టీమిండియా క్రికెటర్​ను కంటెస్టెంట్​గా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.

Ambati Rayudu రాయుడు ఎంట్రీ..

భారత జట్టు తరఫున అద్భుతంగా ఆడుతూ సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడును షోలోకి తీసుకొచ్చేందుకు బిగ్​బాస్ టీమ్ ట్రై చేస్తోందని సమాచారం. గ్రౌండ్​లోనే కాదు బయట కూడా కాస్త దూకుడుగా ఉండే అతడిని షోలోకి తీసుకొస్తే కంటెంట్​కు కొరత ఉండదని బిగ్​బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. రాయుడు ఉంటే తెలుగుతో పాటు యూనివర్సల్ అప్పీల్ కూడా ఉంటుందనేది వాళ్ల ఆలోచన అని తెలుస్తోంది . గత ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించాడు. అయితే రాయుడు ఆటలోనే కాదు బయట కూడా చాలా దూకుడు స్వభావంతో ఉంటాడు. పలుసార్లు ప్లేయర్లతో పాటు అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు మేనేజ్మెంట్‌పై సైతం తన ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కాడు.

Ambati Rayudu బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెట‌ర్‌నే ప‌ట్టుకొస్తున్నారాఇక నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్

Ambati Rayudu : బిగ్ బాస్‌లోకి ఈ సారి ఆ స్టార్ క్రికెట‌ర్‌నే ప‌ట్టుకొస్తున్నారా..ఇక నేష‌న‌ల్ లెవ‌ల్‌లో క్రేజ్..!

రాయుడు ఉంటే షోకి.. యూనివర్శిల్ అప్పీల్ వస్తుంది. అందుకే రెమ్యూనరేషన్ ఎంతైనా సరే.. ఆయన్ను ఒప్పించేందుకు బిగ్ బాస్ టీమ్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం మనీ కోసమే అయితే.. రాయుడు వచ్చే అవకాశం లేదు. అతని మనసు ప్రస్తుతం పాలిటిక్స్‌పై ఉంది. అయితే కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయాలని రాయుడు భావిస్తే.. మాత్రం అతను ఓకే చెప్పే అవకాశం ఉంది. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో నిర్వాహ‌కులు ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఇస్తార‌నేది చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది