Ananya Pandey :లేలేత పరువాలతో పిచ్చెక్కిస్తున్న అనన్య పాండే.. అందాల దాడి తట్టుకోవడం కష్టమే..!
Ananya Pandey:గ్లామర్ ప్రపంచంలో అందాల ఆరబోత తప్పని సరి. ముఖ్యంగా కుర్ర హీరోయిన్స్ అందాలు ఆరబోస్తే కాని ఆఫర్స్ వచ్చేలా లేవు. డిఫరెంట్ టైప్ డ్రెస్సులతో ప్రతి ఒక్కరి దృష్టి తమపై పడేలా చేసుకుంటూ ఉంటున్నారు అందాల హీరోయిన్స్. లైగర్’ బ్యూటీ అనన్య పాండే అయితే అందాల ఆరబోతలో తగ్గేదే లే అంటుంది. ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా పార్టీ ముంబైలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రొడక్షన్ హౌస్‌లో లైగర్ సినిమా కోసం పనిచేస్తున్న హీరోయిన్ అనన్య పాండే ఈ వేడుకకు బోల్డ్ డ్రెస్ వేసుకొచ్చింది.పార్టీలోని కెమెరా కళ్లన్నీ ఆమెపైనే పడ్డాయి.
ఇంకేముంది అనన్య ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆమె వేసుకున్న డ్రెస్‌పై కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేశారు. దానిపై చుంకీ పాండే స్పందిస్తూ.. తనకు అనన్య, రైసా ఇద్దరు కుమార్తెలు ఉన్నారని చెప్పిన చుంకీ పాండే వాళ్ళను చాలా బాగా పెంచామని, ఇద్దరూ చాలా తెలివైనవారని చెప్పారు. అయితే వాళ్లకు ఎలాంటి దుస్తులు అనే కండీషన్స్ ఎప్పుడూ పెట్టలేదని తెలిపారు. ప్రస్తుతం అనన్య గ్లామర్ ప్రపంచంలో ఉంది కాబట్టి ఆమెకు గ్లామరస్ లుక్ అవసరం అని అన్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తోంది . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
ananya pandey stylish looks viral
Ananya Pandey : లైగర్ బ్యూటీ రచ్చ పీక్స్‌లో..
బాక్సింగ్ నేపథ్యంలో డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య తాజాగా కురచ దుస్తులలో గ్లామర్ ఒలకబోస్తూ కేక పెట్టిస్తుంది. అనన్య అందాల ఆరబోతకి కుర్రకారు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ నటీమణిగా ఉన్న అనన్య పాండే, ఇదే సమయంలో ప్రాంతీయ భాషల మూవీ మేకర్స్ దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆమె సై అంటే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే లైగర్ లో కూడా నటిస్తోంది. అయితే ఆమె సన్నిహితుడు ఇషాన్ ఖట్టర్ లు విడిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. మూడేళ్ల నుంచి అత్యంత సన్నిహితులుగా చలామణి అయిన వీరిద్దరూ .. హుందాగా విడిపోయారట.