Anasuay : అలాంటివి చూపిస్తున్నారు.. జబర్దస్త్ షోపై అనసూయ కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Published on: December 3, 2021, 5:00 pm

Anasuay : జబర్దస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. ఆర్టిస్ట్‌లు, టీం లీడర్లు కష్టపడుతుంటే న్యాయ నిర్ణేతలు, యాంకర్లు తమ పని తాను చేసుకుంటూనే ఉంటారు. అప్పుడప్పుడు రెజా అయితే స్కిట్లను చూడటం మానేసి తింటూ కూర్చుంటుందట. నాగబాబు ఉన్న సమయంలో నాగబాబు కూడా అంతేనట. స్కిట్లు బోర్ కొట్టినప్పుడు మధ్యలోనే లేచి వెళ్లిపోయేవారట.

అలా ఎడిటింగ్ మ్యాజిక్‌తో కవర్ చేసేవారట. ఇక ఓ వైపు షూటింగ్‌లు జరుగుతూ ఉంటే.. మరో వైపు ఈ జడ్జ్‌లు, యాంకర్ అనసూయ మాత్రం ఫోన్లలో మునిగిపోతారట. ఇదే విషయం గత వారంలో వచ్చిన ప్రోమోలో కనిపించింది. సెట్‌లో అనసూయ ప్రోమోను వాడటంపై ఈ మధ్య టీం లీడర్లు పంచులు వేస్తున్నారు. హైపర్ ఆది అయితే ఏకంగా రోజా మీదనే కౌంటర్లు వేస్తుంటాడు.

Anasuay Phone usage In Jabardasth

Anasuay Phone usage In Jabardasth

Anasuay : సెట్‌లో ఫోన్ వాడుతున్న అనసూయ..

తాజాగా వదిలిన జబర్దస్త్ ప్రోమోల్లోనూ అనసూయ మళ్లీ దొరికిపోయింది. టీం లీడర్లు కష్టపడి స్కిట్లు చేస్తుంటే.. అనసూయ మాత్రం ఫోన్ వాడుతూ కనిపించింది. పోయిన సారి కూడా ప్రోమోలో వేశారు అంటూ ఫోన్ వాడకంపై అనసూయ తన బాధను చెప్పుకుంది. మొత్తానికి అనసూయ మాత్రం ఇలా ఫోన్లతో బిజీగా ఉండటం, సెట్లో తన ప్రపంచంలో తాను ఉండటం మాత్రం వైరల్ అవుతోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp