Ashu Reddy : ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో
Ashu Reddy ఎక్స్ ప్రెస్ హరి, అషూ రెడ్డి Ashu Reddy వ్యవహారం ఎంతగా వైరల్ అవుతోందో అందరికీ తెలిసిందే. కామెడీ స్టార్స్ షోలో ఈ జోడి చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందనే టాక్ మాత్రం వచ్చింది. హ్యాపీ డేస్ షోకు కూడా ఈ ఇద్దరూ కలిసే పని చేస్తున్నారు. తెర వెనుక మాత్రం అన్నయ్యా అంటూ హరిని అషూ ఆట పట్టిస్తూ ఉంటుంది. అయితే తాజాగా హరి చేసిన పనికి అషూ షాక్ అయింది. ఈ మేరకు స్కిట్ కోసం హరి సాహసం చేసేశాడు.

express hari ashu reddy tattoo goes viral
గుండెలపై ‘అషురెడ్డి’ పచ్చబొట్టు Ashu Reddy
తాజాగా కామెడీ స్టార్స్ ప్రోమోను వదిలారు. ఇందులో అషూ రెడ్డి Ashu Reddy పేరును తన ఎదపై వేయించుకున్నాడు హరి. ‘నువ్ ఛీ కొట్టిన చెంపమీద కొట్టినా.. నీ వెనకాలే తరిగి నువ్వే కావాలనుకుంటున్నావ్ చూశావా?? అందులోనే నిజమైన ప్రేమ ఉంది.. అమ్మాయి ప్రేమ కళ్లల్లో కనిపిస్తుంది.. కానీ అబ్బాయి ప్రేమ కన్నీళ్లలో మాత్రమే కనిపిస్తుంది’ అంటూ భారీ డైలాగ్‌లు కొడుతూ.. ‘నిన్ను ఎంతలా గుర్తుపెట్టుకున్నానో తెల్సా.. నువ్ ఎప్పటికీ నా గుండెలపై ఉండిపోయేంతలా అంటూ తన గుండెలపై ఉన్న ‘అషురెడ్డి’ పచ్చబొట్టును చూపించాడు హరి.

express hari ashu reddy tattoo goes viral
దీంతో దెబ్బకి షాకైన అషూ రెడ్డి.. Ashu Reddy ‘ఏయ్ స్కిట్ కోసమేనా?? లేకపోతే ఏంటి? అని అడిగేసింది. నిజమే అని అనడంతో అషరెడ్డి లాగిపెట్టి అతని చెంపపై కొట్టింది. ‘అన్నా ఎప్పుడు వేసినా చెరిగిపోద్ది.. పర్మినెంట్‌ది వేసుకో పచ్చబొట్టు వేసే వాడు అన్నాడు..ఒక్క నిమిషం ఆలోచించుకో అన్నా.. షూటింగ్ కోసం అంటున్నావ్ అని అన్నాడు.. అలా పదిహేను నిమిషాలు ఆలోచించి.. వేసేసుకుందాం అని ఫిక్స్ అయ్యాన’ని హరి అన్నాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఇదంతా ప్రోమో కోసం, షో టీఆర్పీ కోసం ఆడుతున్న డ్రామాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీని కథ ఏంటో తెలియాలంటే ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.
#Ashu peru tattoo veyinchukunna #Hari..Shock ichadu ???? #ComedyStars Sunday at 1:30 PM on #StarMaa#SundayFunday pic.twitter.com/QmMV1NYUg2
— starmaa (@StarMaa) July 9, 2021
ఇది కూడా చదవండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!
ఇది కూడా చదవండి ==> అప్పుడలా.. ఇప్పుడిలా.. వైరల్ అవుతున్న వంటలక్క రేర్ ఫిక్స్
ఇది కూడా చదవండి ==> ప్రమోషన్స్‌లో కొత్త పుంతలు.. ఎంతైనా సుమ స్టైలే వేరు.. వైరల్ వీడియో..!
ఇది కూడా చదవండి ==> నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌతమ్ పిక్స్ వైరల్