Anasuya : పసుపు రంగు డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న అనసూయ.. థ్రిల్ అవుతున్న కుర్రకారు
Anasuya : నటిగా, యాంకర్‌గా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో కట్టిపడేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం టీవీ షోస్ చేస్తూనే సినిమాలలో నటిస్తుంది. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో అరి అనే చిత్రం రూపొందనుంది. సాయికుమార్, ‘శుభలేఖ’ సుధాకర్, వైవా హర్ష ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ‘పేపర్ బాయ్’ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన రెండో చిత్రం ఆర్వీ రెడ్డి సమర్పణలో శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టైటిల్ లోగోను హుజూరాబాద్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విడుదల చేశారు.
ఆ కార్యక్రమానికి అనసూయ పసుపు రంగు దుస్తులలో హాజరైంది. అనసూయ స్టన్నింగ్ లుక్స్ చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు. వయస్సు పెరుగుతున్నా కూడా అందం ఏ మాత్రం తగ్గట్లేదని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మొత్తం పసుపు రంగు దుస్తులలో అనసూయ వారెవ్వా అని అనిపించింది. ‘‘అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం. అది ఎవరు? అనేది సినిమాలో చెప్పాను’’ అన్నారు జయశంకర్. ‘‘మనిషి ఎలా బతకకూడదో మా సినిమా చూపిస్తుంది’’ అన్నారు శేషు మారంరెడ్డి. ‘‘మా సినిమా మళ్లీ మళ్లీ చూసేలా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రామిరెడ్డి. ‘‘అరి’లో మంచి వినోదం కూడా ఉంది’’ అన్నారు అనసూయ. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు.
Anasuya : అనసూయ అందం అదరహో..
దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా కుతూహలం కలిగింది అని అనసూయ పేర్కొంది. జూమ్‌లో నేను లాక్‌డౌన్‌లో కథ విన్నాను. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో అద్భుతమైన కంటెంట్‌లతో సినిమాలు వస్తున్నాయి. మనకెందుకు రావని చూసినప్పుడు అనిపించేది. ఈ కథ విన్నాక మనం కూడా తీయగలం అనిపించింది. చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రంగస్థలంలో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. ఈ జన్మకు చాలు అన్నట్లు అనిపించింది. ఆ తర్వాత రెండేళ్ళపాటు అవకాశాలు రాలేదు. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. లక్కీగా ఫీలవుతున్నాను. నాకోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు. పుష్ప చాలా సంతృప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర వుంది. ‘అరి’ సినిమాలో హ్యుమానిటీతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంది. ఇది అందరికీ నచ్చుతుంది అని అనసూయ చెప్పారు.