Anasuya : 24 గంటలు అదేనట.. అనసూయ షాకింగ్ కామెంట్
Anasuya: అందాల ముద్దుగుమ్మ అనసూయ ఇటీవలి కాలంలో చేసే సందడి మాములుగా లేదు. ఇటు బుల్లితెర అటు వెండితెరపై ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా పోషించిన అనసూయ అక్కడ నుండి సినిమాలలో మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది. అల్లు అర్జున్ పాన్ఇండియా పుష్పలో దాక్షాయని అనే పవర్ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో అనసూయ బిజీగా ఉంది. ఖిలాడీ చిత్రంలో కూడా అనసూయ నటిస్తుండగా, ఇందులో రవితేజకి అత్తగా ఆమె నటించనుందనే ప్రచారం నడుస్తుంది.
చంద్రకళ అనే పాత్రలో అనసూయ కనిపించనుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అంటూ ఫుల్‌గా బిజీగా గడిపేస్తుంది అనసూయ. 24 గంటలు పనితోనే బిజీ అంటూ అనసూయ తన సోషల్ మీడియాలో పెట్టిన కామెంట్ వైరల్‌గా మారింది. అనసూయ బిజీ లైఫ్‌ని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. యాంకర్ గా నటిగా అనసూయ రెండు రంగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా అనసూయ తన గ్లామర్ తో బుల్లితెరపై రారాణిలా వెలుగొందుతోంది. అనసూయ అందాల ధాటికి కుర్రాళ్ళ హృదయాలు గల్లంతయిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది.

anasuya comments about work
Anasuya : అనసూయ మాములు బిజీ కాదు..
వెండితెరపై ఓ తరహా పాత్రలకు అనసూయ బెస్ట్ ఛాయిస్ అయ్యారు.చాలా కాలం క్రితమే వివాహం చేసుకున్న అనసూయకు ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీకి కెరీర్ కు అనసూయ సమానమైన ఇంపార్టెన్స్ ఇస్తుంది. అయినప్పటికీ అనసూయ తన గ్లామర్ తో మతి పోగొడుతుంది. ఫిట్ నెస్ విషయంలో అనసూయ చాలా కేరింగ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్లకు కనువిందు చేస్తున్నారు. తరచుగా అనసూయ ఫొటోస్ ఇంటర్నెట్ లో దుమారం రేపుతున్నాయి. అనసూయ హాట్ నెస్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.