Anasuya : నా జీవితాన్నే మార్చేసిన సినిమా ఇది అంటూ అన‌సూయ ఎమోష‌న‌ల్‌ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anasuya : నా జీవితాన్నే మార్చేసిన సినిమా ఇది అంటూ అన‌సూయ ఎమోష‌న‌ల్‌

Anasuya : అనసూయ‌.. ఈ పేరు వింటే అభిమానులు పూన‌కంతో ఊగిపోతుంటారు. త‌న అంద‌చందాల‌తో అంత‌గా ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు న‌టిగాను మంచి మార్కులు కొట్టేస్తుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా మంచి పేరు తెచ్చుకున్న అన‌సూయ ఇప్పుడు పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణిగా అద‌ర‌గొట్టింది. అన‌సూయ మాస్ లుక్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది. పుష్ప‌ మూవీలో నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న దాక్షాయణి పాత్రలో అనసూయ సునీల్‌కి భార్యగా నటించి, మెప్పించింది. ఫ‌స్ట్ పార్ట్‌లో అన‌సూయ పాత్ర కాస్త త‌క్కువే […]

 Authored By sandeep | The Telugu News | Updated on :8 January 2022,7:40 pm

Anasuya : అనసూయ‌.. ఈ పేరు వింటే అభిమానులు పూన‌కంతో ఊగిపోతుంటారు. త‌న అంద‌చందాల‌తో అంత‌గా ఊపేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు న‌టిగాను మంచి మార్కులు కొట్టేస్తుంది. రంగ‌స్థ‌లం చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా మంచి పేరు తెచ్చుకున్న అన‌సూయ ఇప్పుడు పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణిగా అద‌ర‌గొట్టింది. అన‌సూయ మాస్ లుక్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది. పుష్ప‌ మూవీలో నెగెటీవ్‌ షేడ్స్‌ ఉన్న దాక్షాయణి పాత్రలో అనసూయ సునీల్‌కి భార్యగా నటించి, మెప్పించింది. ఫ‌స్ట్ పార్ట్‌లో అన‌సూయ పాత్ర కాస్త త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ సెకండ్ పార్ట్‌లో ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌.

అయితే అన‌సూయ న‌టించిన తాజా చిత్రం పుష్ప ఓటీటీలోకి విడుద‌ల కాగా, ఈ చిత్రాన్ని వీక్షించిన ప్ర‌తి ఒక్క‌రు బ‌న్నీతో పాటు చిత్ర న‌టీన‌టుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ సైతం పుష్ప సినిమాను వీక్షించి ప్రశంసల వర్షం కురిపించాడు. దాదాపు సెలెబ్రిటీలంతా కూడా పుష్పను ఇంట్లో కూర్చొని వీక్షించినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగా అనసూయ కూడా తన ఫ్యామిలితో పాటుగా పుష్ప సినిమాను ఇంట్లోనే వీక్షించింది.పుష్ప సినిమాను వీక్షిస్తోన్నట్టు అనసూయ తెలిపింది.

anasuya emotional after watching pushpa

anasuya emotional after watching pushpa

Anasuya : ఓటీటీలో పుష్ప చూసి అన‌సూయ ఎమోష‌న‌ల్‌

నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ టాలీవుడ్ లో యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది