Anasuya : క‌ష్టంగా సాగుతున్న అన‌సూయ లైఫ్‌.. అదే మెయిన్ రీజ‌నా?

 Authored By sandeep | The Telugu News | Updated on :14 November 2022,11:40 am

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌.యాంక‌ర్‌గా స‌త్తా చాటుతున్న స‌మ‌యంలో సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చ‌కుంది అన‌సూయ‌. రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో నటిగా నిరూపించుకున్న అన‌సూయ‌.. రంగమార్తాండ, పుష్ప 2, అరి సినిమాలతో అల‌రించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. సింబ, మైఖేల్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.ఇక తమిళ్‌లో డైరెక్టర్ ప్రభుదేవ డైరెక్షన్ రెండు సినిమాలకు సైన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. వీటితో పాటు మరో అరడజకు పైగా సినిమాలు అనసూయ లిస్ట్‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

అయితే జ‌బ‌ర్ధ‌స్త్ నుండి అన‌సూయ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత నుండి ఆమె క్రేజ్ చాలా తగ్గిన‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు విజయ్ దేవరకొండ లైగర్ సినిమాపై పరోక్షంగా ట్విట్ చేసిన ద‌గ్గ‌ర నుండి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉన్నారు . అంతేకాదు అనసూయ కూడా తగ్గేదేలే అంటూ ఆమెను ఆంటీ అన్న వాళ్లకి అంకుల్ ,తాత అంటూ ఘాటుగా రిప్లై ఇస్తూనే ఉంది. ఇటీవ‌ల అన‌సూయ త‌న సినిమాలు, ప్రాజెక్ట్‌ల క‌న్నా కూడా వివాదాల‌తోనే వార్త‌ల‌లో నిలుస్తుంది. అందుకు కార‌ణం అనసూయ జాతకంలో ఒక దోషం ఉందని ..దానికి తగ్గ పరిహార పూజలు చేయించుకుంటే ఆమెకు మళ్ళి మంచి రోజులు వ‌స్తాయ‌ని కొంద‌రు చెబుతున్నారు.

Anasuya faces lot of problems

Anasuya faces lot of problems

Anasuya : అది చేస్తే చాలు..!

త్వరగా శాంతి పరిహార పూజలు చేసుకుంటే మళ్లీ మునుపటి అనసూయని మనం చూడవచ్చుఅంటూ ప‌లువురు సోష‌ల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం మతి పోగొట్టే పరువాలతో అనసూయ అప్పుడ‌ప్పుడు క్యూట్ ఫోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త లుక్స్ లో కనిపిస్తూ సంద‌డి చేస్తుంటుంది అన‌సూయ‌.పుష్ప చిత్రంలో సునీల్ భార్య గా అనసూయ డీగ్లామర్ రోల్ లో నటించి అల‌రించ‌గా, పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. పుష్ప 2 లో అనసూయ పాత్ర థ్రిల్లింగ్ క‌లిగించే విధంగా ఉంటుంద‌ని అంటున్నారు.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి