Anasuya : నీకిప్పుడు అవసరమా ఆంటీ.. అనసూయ వర్కౌట్స్ వీడియోపై నెటిజన్ల ట్రోలింగ్..
ప్రధానాంశాలు:
నీకిప్పుడు అవసరమా ఆంటీ..
అనసూయ వర్కౌట్స్ పై నెటిజన్ల ట్రోలింగ్
Anasuya : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుల్లితెర, వెండితెర మాత్రమే కాదు సోషల్ మీడియాలో ఆమె నడిపిస్తున్న హవా మామూలుగా కాదు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా, తనపై ఎన్ని ట్రోల్స్ నడిచిన అసలు లెక్క చేయకుండా తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. తనని ట్రోల్ చేస్తున్న వారికి బోలెడన్ని సార్లు క్లాస్ పీకిన అనసూయ నిత్యం సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతుంది. తాజాగా దసరా పండుగ సందర్భంగా జిమ్ వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ మళ్లీ సీరియస్ అయింది అనసూయ.
జిమ్ లో హెవీ వర్కౌట్స్ చేస్తూ చెమటలు కక్కేస్తున్న వీడియోని పంచుకుంది అనసూయ. ఈ వీడియో తో పాటు ట్రైలర్స్ కి షాక్ ఇస్తూ మహిళలని ప్రోత్సహించేలా సుదీర్ఘమైన పోస్టును రాసింది. ఈ సమాజంలో దుష్ట శక్తులపై పోరాడుతూ మహిళ నుంచి కాళీగా మారాల్సి ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ దసరాను చెడుపై మంచి సాధించిన విజయం లా జరుపుకోండి. సోమరితనాన్ని జయించండి అని చెప్పింది. రెండేళ్ల క్రిందట మా నాన్న ను కోల్పోయాను. ఒక్కసారిగా అన్నింటి పై ఆశలు పోయాయి. ఆహారపు అలవాట్లు, నిద్ర గాడి తప్పాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని మా నాన్న ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.
ఈ దసరాతో ప్రారంభించాను. మహిళలందరిని ఈ వీడియో ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. స్త్రీ శక్తిని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవరు ఏమి అన్నా నీ శక్తిని నమ్ముకో. నీకు ఇప్పుడు అవసరమా ఆంటీ అని, 35 దాటిన నీకెందుకు ఇవన్నీ, ఇంట్లో పిల్లల్ని చూ ప డ జీ ౩సుకోవచ్చు కదా ఇలాంటి కామెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా కామెంట్స్ చేస్తే ఎదుగుదలను చూసి అంతా భయపడేవారు అని తన నోట్ లో రాసింది అనసూయ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. అనసూయ ఇంతలా వర్కౌట్స్ చేస్తే తన అందాన్ని ఇలా మెయింటైన్ చేస్తున్న అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
