Anasuya : అనసూయ ఏంటి ఈ అందం.. సరికొత్త చీరకట్టుతో కుర్రకారుకు పిచ్చెక్కించేసింది.. వీడియో వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: November 15, 2022, 1:20 pm

Anasuya : అనసూయ పేరు చెబితే చాలు.. కుర్రకారు ఫిదా అయిపోవాల్సిందే. తన అందాలకు కుర్రకారు మతులు పోగొట్టుకోవాల్సిందే. అనసూయ అందానికే పెట్టింది పేరు. తను ఇప్పుడు కేవలం బుల్లితెర నటి మాత్రమే కాదు. తనది హీరోయిన్ రేంజ్. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు. తన గ్లామర్ షో ముందు స్టార్ హీరోయిన్లు కూడా దిగదుడుపే. అసలు జబర్దస్త్ అనే కామెడీ షోకు అంత పేరు వచ్చిందంటే దానికి కారణం ఇంకెవరో కాదు యాంకర్ అనసూయ. కేవలం తన కోసమే జబర్దస్త్ ను చూసిన వాళ్లు కోకొల్లలు.

రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ లో నటించి వెండి తెర మీద కూడా తన సత్తా చాటింది అను. ప్రస్తుతం రంగమార్తాండ అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. దేవదాసి అనే పాత్రలో తను నటిస్తోంది. ఈ పాత్ర కొంచెం బోల్డ్ గానే ఉంటుందట. నిజానికి.. అనసూయకు చాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటేనే ఇష్టం.. అందుకే రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో ఆయా పాత్రల్లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనసూయకు సంబంధించిన సరికొత్త చీరకట్టు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నిజానికి ఇది పాత వీడియోనే.

Anasuya Latest Saree Video Viral on Social Media

Anasuya Latest Saree Video Viral on Social Media

Anasuya : అనసూయ సరికొత్త చీరకట్టు వీడియో వైరల్

2020 నవరాత్రుల సందర్భంగా ఆ వీడియోను విడుదల చేసింది అను. కానీ.. ఆ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ట్రెండీగా నవరాత్రుల సందర్భంగా ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి.. ఎలాంటి చీరలు కట్టుకోవాలో కట్టుకొని మరీ చూపించింది అను. అందులో సరికొత్త చీరకట్టుతో అనసూయ దర్శనమిచ్చింది. తన ట్రెండీ శారీని చూసి నెటిజన్ల మతులు పోతున్నాయి. తనను అలా శారీలో చూసి తట్టుకోలేకపోతున్నారు. పిచ్చెక్కిపోతోంది వాళ్లకు. ఆ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp