anasuya place relpalced by manjusha
Anasuya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. జబర్ధస్త్ షోతో పాపులరిటీ తెచ్చుకున్న అనసూయ గత వారం ఎపిసోడ్ తో అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది. ఈ లెజెండరీ కామెడీ షో ప్రారంభం నుండి యాంకర్ గా ఉన్న అనసూయ అనూహ్యంగా బయటికి వెళ్ళిపోయింది. జులై 28న ప్రసారమైన ఎపిసోడ్ అనసూయకు చివరిది. అనసూయను షో వీడకుండా చేయాలని టీం లీడర్స్, జడ్జెస్ చివరి నిమిషం వరకు ప్రయత్నం చేశారు. జడ్జి ఇంద్రజ మిమ్మల్ని ఈ స్టేజ్ చాలా మిస్ అవుతుందని చెప్పింది.
తాజా సమాచారం ప్రకారం ప్రముఖ యాంకర్ మంజుష ఇప్పుడు అనసూయ స్థానంలో జబర్దస్త్ కి హోస్ట్ గా వ్యవహరించనుందట. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఆగస్టు 4 న ఎయిర్ కాబోతున్న ఎపిసోడ్ నుంచి కొత్త యాంకర్ అనసూయ స్థానంలోకి రాబోతోంది. మరోవైపు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ చెందుతున్నారు. ఆగస్టు 4న ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో మల్లెమాల వారు తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి కార్తికేయ 2 మూవీ టీమ్ నిఖిల్, శ్రీనివాసరెడ్డి, దర్శకుడు చందూ మొండేటి వచ్చారు. ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.
anasuya place relpalced by manjusha
టీమ్ లీడర్స్, కమెడియన్స్ నవ్వులు పూయించారు. చివర్లో యాంకర్ ని పరిచయం చేశారు. జబర్దస్త్ కొత్త యాంకర్ ని ఏకంగా పల్లకీలో తెచ్చారు. ఆమె ఎవరో తెలుసుకోవాలని టీమ్ లీడర్స్ కూడా పోటీపడ్డారు. నెక్స్ట్ ఎపిసోడ్ పై హైప్ తేవడానికి ఆ యాంకర్ ఎవరో చూపించకుండానే ప్రోమో కట్ చేశారు. సీనియర్ యాంకర్ మంజుషాను తీసుకున్నట్లు కొన్నాళ్లుగా కథనాలు వెలువడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది వచ్చే వారం ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు చెప్పలేం. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా రష్మీ గౌతమ్ కొనసాగుతున్నారు.
Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…
Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
This website uses cookies.