Anasuya : అనసూయ ఊర మాస్ అంటే ఇదే .. మొహం మీదనే అడిగేసింది !
Anasuya: యాంకర్ అనసూయ సినిమాలు, రియాలిటీ షోలే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె మాస్ యాంగిల్ చాలా మందికి తెలియదు. క్లాస్‌గా ఉంటే క్లాస్.. ఏదైనా తేడాలు చేస్తే అమ్మడు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. మాస్ అనసూయను చూస్తే ఎవరూ తట్టుకోలేరు. అది ఎలాంటి ప్రశ్నైనా సరే.. అది ఎంత బోల్డుగా ఉన్నా అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది అను. ఇప్పుడు కూడా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మొహం మీదే ఆన్సర్ ఇచ్చింది. దాంతో మనోడి బుర్ర గిర్రున తిరిగింది. ఇంత బిజీగా ఉన్నా కూడా ఇప్పటికీ వారంలో ఏదో ఒక రోజు ఏదో ఓ టైమ్ లో వచ్చి ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది అనసూయ. నెటిజన్స్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది.
మరికొన్ని సార్లు మాత్రం తానే స్వయంగా కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ వాటి గురించి వివరిస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ ముద్దుమ్మ. ఆ మధ్య మీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే భర్త ఫోటో షేర్ చేసింది. తన భర్తే మొదటి బాయ్‌ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది. తన వరకు నా మొదటి, రెండో, మూడో.. ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఆయనే నా బాయ్‌ఫ్రెండ్ అని చెప్పుకొచ్చింది. ఇలా అభిమానులు ఏం అడిగినా కూడా వెంటనే సమాధానమిస్తుంది అనసూయ. ఇప్పుడు కూడా అంతా రొటీన్ ప్రశ్నలు అడుగుతుంటే.. ఒక్కరు మాత్రం కాస్త కొంటెగా ప్రశ్నించాడు. ‘నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడిగాను.. అయినా ఈ విషయంపై నువ్వు ఏమాత్రం స్పందించలేదు’ అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు అనసూయ సైతం ఒక్కసారిగా షాక్ అయిపోయింది.
Anasuya : ఇంతకీ ఏం అడిగాడంటే..
అంతలోనే తేరుకుని అతడికి సమాధానం కూడా ఇచ్చింది. ఆ నెటిజన్ పెళ్లి ప్రపోజల్ గురించి స్పందిస్తూ.. సింపుల్‌గా ఓ ఇమోజీని పోస్ట్ చేసింది ఈ భామ. ఈ విషయంపై తాను ఆలోచిస్తున్నటువంటి ఒక ఫోటోని కూడా ఆమె షేర్ చేసింది. సోషల్ మీడియాలో ఈ ఇద్దరి మధ్య సంభాషణ వైరల్ అవుతుంది. సెలబ్రిటీస్ ఇలా లైవ్‌లోకి వచ్చినపుడు.. రొటీన్ ప్రశ్నలు కాకుండా ఇలా కాస్త కొంటెగా ప్రయత్నిస్తే.. వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా అనసూయ కూడా దీన్ని ఫన్నీ వే లోనే తీసుకుంది కానీ సీరియస్‌గా కాదు. పెళ్లై ఇద్దరు పిల్లల తల్లైన అనసూయకు మళ్లీ పెళ్లి ప్రపోజల్ అంటే.. సదరు నెటిజన్ కూడా ఆట పట్టించడానికే అడిగాడని అర్థమవుతుంది. దానికి అనసూయ కూడా అంతే మొహం మీద సమాధానమిచ్చింది. ఈ మధ్యే గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది అనసూయ. దాంతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈమె ఖాతాలో ఉన్నాయి.