Anasuya : ఎదుటి వాళ్లను కించపర్చకండి.. అనసూయ పోస్ట్ వైరల్
Anasuya : యాంకర్ అనసూయ.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గాను, నటిగాను అలరిస్తున్న అనసూయ సోషల్ మీడియాలోను తెగ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఈ అమ్మడు మహిళా దినోత్సవం సందర్భంగా తెగ ట్వీట్స్ చేస్తున్న మీమ్స్ రాయుళ్లని ఉద్దేశించి ఓ ట్వీట్ చేసింది. ఓ.. సడెన్‌గా ఈ రోజు ట్రోలర్స్, మీమ్ మేకర్స్ అందరూ కూడా మహిళలను గౌరవిస్తున్నారు. ఇది 24 గంటల్లోనే ముగుస్తుందని తెలుసు.. అందుకే మహిళలందరికీ హ్యాపీ ఫూల్స్ డే అంటూ అనసూయ ట్వీట్ వేసింది. దీనిపై అనసూయ మీద ట్రోలింగ్ చేశారు.సమాజంలో మంచి చెడు రెండూ ఉంటాయి. మగాళ్లలో ఆడవాళ్లు అంటే గౌరవం లేని వాళ్ళతో పాటు పూజించే వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ ఓ గాటిన కట్టేయకూడదు.
ఈ సూత్రం మగాళ్ల పట్ల స్త్రీలకు కూడా వర్తిస్తుంది. మగాళ్లను హింసించే ఆడాళ్లతో పాటు ప్రేమించే ఆడవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి ఏక పక్షంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం సరికాదు అని అనసూయపై కొందరు మండిపడ్డారు. తెలుగులో సుమ, ఉదయభాను, శ్యామల వంటి యాంకర్స్ ఉన్నారు. వారిని ఎప్పుడూ ఎవరూ ట్రోల్ చేయరు. వాళ్ళని చేయని వాళ్ళు మిమ్మల్ని మాత్రమే చేస్తున్నారంటే తప్పు మీదా, మీమర్స్ దా?… నిజానికి రష్మీ గౌతమ్, శ్రీముఖి లాంటి యాంకర్స్ కూడా పొట్టిబట్టలు వేసుకుంటారు. వాళ్ళను కూడా ఎవరూ ట్రోల్ చేయరు అంటూ అనసూయని ఓ రేంజ్‌లో వేసుకున్నారు.అయితే అనసూయ వరుస కొటేషన్స్ పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఎదుటివారు ఎలాంటి వారు అయిన కించపరచకూడదు అంటూ సూక్తులు చెబుతుంది.

anasuya stunning post viral
Anasuya : సోషల్ మీడియాలో అనసూయ రచ్చ..
ట్రోలింగ్ మీద అనసూయ సన్నిహితులు ఒకరు ఇలా స్పందించారట. నువ్ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే సక్సెస్‌ఫుల్ మహిళవి. ట్రోలర్స్, మీమర్స్, మొహం తెలియని వాళ్లు చేసే నెగెటివ్ కామెంట్లు నిన్నే ఇంకా బలవంతురాలిని చేస్తాయ్. అలాంటి వారిని చూసినప్పుడు నాకు చిరాకు కాకుండా జాలి వేస్తుంటుంది. నువ్ నీ వ్యక్తిత్వంతో ఇన్నేళ్లుగా కెమెరాముందుంటూ లైమ్ లైట్‌లో ఉన్నావ్.. విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ అనసూయ ఫ్రెండ్ ఒకరు మెసెజ్ పెట్టేశారట. ఇలాంటివి చూసినప్పుడు నేను చేసేది రైటే అన్న ఫీలింగ్ కలుగుతుంటుంది.. నీలాంటి వాళ్లే ఈ ప్రపంచానికి కావాలి.. అని అనసూయ చెప్పుకొచ్చింది.

anasuya stunning post viral