Anasuya : ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ సంచలన ట్వీట్
ప్రధానాంశాలు:
Anasuya : ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ సంచలన ట్వీట్
యాంకర్ అనసూయ తన కెరీర్ ప్రారంభం నుండే ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. న్యూస్ రీడర్‌గా ప్రారంభించిన అనసూయ తర్వాత యాంకర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు విభిన్న పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. “జబర్దస్త్” షో ద్వారా విశేషమైన క్రేజ్‌ను పొందింది. అనసూయకు 41 ఏళ్లు అయినా, ఆమె సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

Anasuya : ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ అంటూ అనసూయ సంచలన ట్వీట్
Anasuya ప్లీజ్ దయచేసి ఆపండి అంటూ అనసూయ ఎమోషనల్ ట్వీట్
ఇక సోషల్ మీడియా లోను నిత్యం యాక్టివ్ గా ఉంటూ పిక్స్ , వీడియోస్ షేర్ చేయడమే కాదు అప్పుడప్పుడు పలు అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూవివాదంపై అనసూయ తన స్పందనను తెలిపింది. కంచ గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాల భూమి గురించి హెచ్‌సీయూ మరియు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతుంది.
ఈ భూమిపై చెట్లు నరికివేతను ఆపాలని, వేలం వేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ పరిణామంపై అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేసి “ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్” అని పేర్కొంది. వీడియోలో, అడవిని పూడ్చివేసే రోజులు వచ్చాయని, చెట్లు నేలకూలాయని ఎమోషనల్ గా తెలిపింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.