Viral Photo : బోసి నవ్వుల బుజ్జాయి ఎవరో తెలుసా? ఈ అమ్మడికి ఫాలోయింగ్ ఎక్కువే..
Viral Photo : ఈ ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న చిన్నారి చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఇప్పుడు ఈ చిన్నారి ఓ సెలబ్రెటీ అయింది. ఈ అమ్మడు చేసే ప్రతి పోస్ట్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. ఒక వైపు టీవీ షోలతో అదరగొడుతూనే.. మరో వైపు వెండితెరపై తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం చేతి నిండ మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంది. మరి ఎవరా సెలబ్రెటీ అనుకుంటున్నారా..? ఇంకెవరు మన రంగమ్మత్తే…
అదేనండి టీవీ యాంకర్ అనసూయ. ఓ వైపు టీవీ షోలు చేస్తూ బిజీగా ఉంటూనే మరో వైపు మూవీస్ చేస్తోంది. ఇంట్రస్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేస్తూ తన ఫ్యాన్స్ ను మెప్పిస్తోంది ఈ ముద్దుగుమ్మ.జబర్దస్త్ కామెడీ షోతో చాలా ఫేమస్ అయింది అనసూయ భరద్వాజ్. ఆ తర్వాత తన మాటలతో, అభినయంతో తెలుగు ఆడియన్స్ కు చాలా దగ్గరైంది. ఆ తర్వాత మరిన్ని షోస్ చేస్తూ కాస్త బిజీ అయింది. రామ్ చరణ్ తేజ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

anchor anasuya child hood photo goes viral
Viral Photo : అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటూ..
అందులో రంగమ్మత్త క్యారెక్టర్‌లో ఒదిగిపోయింది అనసూయ భరద్వాజ్. ఈ మూవీతో తన క్రేజ్ ను అమాంతం పెంచేసుకుంది ఈ అందాలబొమ్మ. ఆ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన పుష్ప మూవీలో దాక్షయాణి క్యారెక్టర్‌లో యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న గాడ్ ఫాదర్ మూవీలో ఓ కీ రోల్‌లో అనసూయ యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఈమూవీతో పాటుగా కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న రంగమార్తాండ మూవీలోనే ఈ అమ్మడు యాక్ట్ చేస్తోంది. చేతి నిండ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram