Anchor Pradeep : హైపర్ ఆది మీద చేయి చేసుకున్నాడు.. యాంకర్ ప్రదీప్ చర్యకు అంతా షాక్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 3 June 2022, 3:30 pm

Anchor Pradeep : హైపర్ ఆది బుల్లితెరపై స్టార్. కేవలం నటన మాత్రమే కాకుండా.. రైటింగ్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తన స్కిట్లను చూసి స్టార్ సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చారు. ఇక ఢీ షో స్క్రిప్ట్ కూడా ఆదినే రాస్తుంటాడు. అలా మల్టీ టాలెంట్‌తో ఆది దూసుకుపోతోంటాడు. ఆది ఇప్పుడు బుల్లితెరపై తిరుగులేని స్టార్‌గా మారిపోయాడు. అయితే అలాంటి ఆదిపై ప్రదీప్ చేయి చేసుకున్నాడు. తల మీద ఒక్కటి ఇచ్చాడు. దీంతో అందరూ నవ్వేశారు. ఆదిని అలా కొట్టడంతో అభిమానులు హర్ట్ అవుతున్నారు. మామూలుగా ఢీ షోలో అయితే అందరూ ఓ ర్యాపో మెయింటైన్ చేస్తుంటారు. ఎవరి మీద ఎవరు ఎలాంటి సెటైర్లు వేసినా కూడా పట్టించుకోరు.

కానీ ఒక్కోసారి పరిధులు దాటుతుంటాయి.అయితే వారంతా కూడా అవి లైట్‌గా తీసుకుంటారు. సుధీర్ మీద అయితే దారుణమైన సెటైర్లు వేస్తుంటారు. సుధీర్ వాటిని అంతగా పట్టించుకోకపోయినా కూడా.. అతని అభిమానులు మాత్రం బాగా హర్ట్ అవుతుంటారు. అలా ఎందుకు పడతారంటూ సుధీర్‌ను ఫ్యాన్స్ అడుగుతుంటారు. తామేం చేసినా కూడా మిమ్మల్ని నవ్వించేందుకే అని హుందాగా సమాధానం ఇస్తాడు. అయితే తాజాగా హైపర్ ఆది తల మీద ప్రదీప్ కొట్టినా కూడా అది స్కిట్లో భాగంగానే అవుతుంది. కానీ ఆది ఇమేజ్‌కు ప్రదీప్ అలా చేయడం కరెక్ట్ కాదని అతని ఫ్యాన్స్ అంటుంటారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది అదరగొట్టేశాడు.

Anchor Pradeep Beaten Hyper Aadi In Dhee Show

Anchor Pradeep Beaten Hyper Aadi In Dhee Show

కాలేజ్‌లో సీనియర్లుగా ఆది, రవికృష్ణలు నటించారు. అప్పుడే కొత్తగా వచ్చిన స్టూడెంట్లలా నవ్య స్వామి, పాపీ మాస్టర్లు కనిపించారు. అయితే ఇలా ఏదో వారంతా కలిసి స్కిట్ చేస్తుంటారు. అయితే ఆ స్కిట్లో ఆది ల్యాగ్ చేస్తున్నాడట.. అందుకే ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. స్కిట్లో ల్యాగ్ చేస్తున్నావేంటి అని ఆది తల మీద నుంచి కొట్టేస్తాడు ప్రదీప్. ఆది ఆ చర్యను ముందే ఊహించినట్టు లేడు. దీంతో వెంటనే షాక్ అవుతాడు. ప్రదీప్ కూడా దాన్ని కవర్ చేసేందుకు ట్రై చేస్తాడు మొత్తానికి ఢీ షోలో మాత్రం ఆదికి తిరుగుండదనే విషయం అందరికీ తెలిసిందే.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి