Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ నిజంగానే రాజు.. యాంకర్ మంచి మనసుకు నిదర్శనమిదే

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 29, 2022, 10:00 am

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ ఈ మధ్య బుల్లితెరపై సందడి తగ్గించేశాడు. ఢీ షోలో మాత్రమే కనిపిస్తున్నాడు. ఇతర ఈవెంట్లు, షోల్లో కనిపించడం మానేశాడు. యాంకర్ ప్రదీప్‌ తన తండ్రి మరణం తరువాత కాస్త జోష్ తగ్గించేసినట్టు కనిపిస్తోంది. ఎక్కువగా ఫ్యామిలీ కోసమే టైం కేటాయిస్తున్నట్టున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం మళ్లీ జోరు పెంచినట్టు కనిపిస్తోంది. సినిమాకు స్పెషల్ ప్రమోషన్లు చేస్తున్నాడు. ఇతర షోల్లోనూ కనిపిస్తున్నాడు. తాజాగా జీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు.అసలు ప్రదీప్ కెరీర్ మొదలైంది కూడా జీ తెలుగులోనే. గడుసరి అత్త సొగసరి కోడలు అంటూ ప్రదీప్ చేసిన ప్రోగ్రాం సూపర్ హిట్ అయింది.

ప్రదీప్‌కు లేడీస్‌లో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత అసలు సిసలైన యాంకర్, హోస్ట్‌గా మారిపోయాడు.బుల్లితెరపై ధీటుగా నిలబడ్డాడు. సుమకు పోటీ ఇచ్చే స్టార్ యాంకర్‌గా మారిపోయాడు. మధ్యలో సినిమాల్లోనూ ట్రై చేశాడు. సైడ్ కారెక్టర్లు వేశాడు. హీరోలకు ఫ్రెండ్స్‌గా నటించేశాడు.అయితే గత ఏడాది హీరోగానూ ట్రై చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అని ప్రేక్షకులను పలకరించాడు. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రదీప్ మాచిరాజు మాత్రం ఎంతో మందికి సాయం చేస్తుంటాడు.

Anchor Pradeep In Zee telugu saregama Show

Anchor Pradeep In Zee telugu saregama Show

ఈ విషయాలేవీ బయటకు రావు. కానీ తెరవెనుక మాత్రం ప్రదీప్ ఎంతో మందికి సాయం చేస్తుంటాడట. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఘటన జరిగింది. సరిగమప షోలో యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో ప్రదీప్ కనిపించాడు.ఓ సింగర్‌కు ఉన్న కష్టాలను విన్న ప్రదీప్ మాచిరాజు.. రాజులా ఓ మాటిచ్చాడు. నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా కూడా ఈ అందరిలానే.. నీకూ ఓ బ్రదర్ ఉన్నాడని, అతని పేరు ప్రదీప్ అని గుర్తు పెట్టుకో అని అనేశాడు. అలానే ఢీ కంటెస్టెంట్‌కి కూడా ప్రదీప్ సాయం చేసిన సంగతి తెలిసిందే.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp