Intinti Gruhalakshmi Lasya : ఇంటింటి గృహలక్ష్మి లాస్య కష్టాలు.. ఎండలో యాంకర్ ప్రశాంతి పరుగులు
Intinti Gruhalakshmi Lasya : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది. నందు, లాస్య, తులసి ఇలా ప్రతీ ఒక్క పాత్ర జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఇక కస్తూరీ శంకర్ అయితే చాలా రోజుల తరువాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక యాంకర్ ప్రశాంతి తన కెరీర్ టర్న్ చేసుకుంది. యాంకర్‌గా అంతో ఇంతో ఫేమస్ అయిన ప్రశాంతి.. విలన్‌గా ఈ సీరియల్‌తో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు లాస్యగా యాంకర్ ప్రశాంతి ఫుల్ ఫేమస్ అయ్యింది. లాస్య పాత్రలో మరొకరిని ఊహించుకోలేనంతగా తన ముద్ర వేసింది.
అలా లాస్య మొత్తానికి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక లాస్య ఆన్ స్క్రీన్‌లో ఎలా కనిపించినా కూడా ఆప్ స్క్రీన్‌లో మాత్రం ఎంతో కూల్‌గా ఉంటుంది. తన ఫ్యాన్స్‌తో ముచ్చట్లు పెడుతుంది. ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తుంది. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపిగ్గా సమాధానాలు చెబుతుంది. ఇక గృహలక్ష్మీ షూటింగ్ విశేషాలను ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. ఆన్ సెట్, ఆఫ్ సెట్ ఎలా ఉంటుందో చూపిస్తుంటుంది. షూటింగ్ గ్యాప్‌లో లాస్య లైవ్‌లోకి వస్తుంది. షూటింగ్ విశేషాలు అందరికీ చూపిస్తుంటుంది. అయితే తాజాగా లాస్య ఎండలో బాగానే కష్టపడుతున్నట్టు కనిపిస్తోంది.

Anchor Prashanthi About Intinti Gruhalakshmi Serial Lasya On set
ఎర్రటి ఎండకు షూటింగ్ చేస్తుండటంతో.. లాస్యకు దిమ్మతిరిగిపోయినట్టుంది. ఏసీ లేదు కదా? అని అంటే.. నువ్ ఉన్నావ్ కదా? అంటూ పక్కనే ఉన్న ఆటోలో కూర్చుంటుంది. ఇక దివ్య, లాస్య కలిసి బాగానే అల్లరి చేసినట్టు కనిపిస్తోంది. ఇక లాస్యతో పరుగులు పెట్టించే సీన్‌ను తెరకెక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి లాస్య పాత్రలో యాంకర్ ప్రశాంతి బాగానే మెప్పించింది. అందుకే ఆమెకు మరో సీరియల్ ఆఫర్ కూడా వచ్చింది. జీ తెలుగులో దేవతలారా దీవించండి అనే కొత్త సీరియల్ ప్రారంభమైంది. ఇందులో యాంకర్ ప్రశాంతి ఎలాంటి పాత్రను పోషిస్తుందో చూడాలి.

Anchor Prashanthi About Intinti Gruhalakshmi Serial Lasya On set