Rashmi Gautam : మనది మనమే పట్టించుకోకపోతే ఎలా.. యాంకర్ రష్మీ ఆవేదన
Rashmi Gautam యాంకర్ రష్మీ Rashmi Gautam మూగ జీవాల కోసం ఎంతలా పాటు పడుతుందో అందరికీ తెలిసింద. మిగతా సెలెబ్రిటీల్లా కాకుండా రష్మీ చెప్పిన మాటలను చేతల్లో చూపిస్తుంటుంది. ఇక సెలెబ్రిటీలు అయితే విదేశాల నుంచి కొత్త కొత్త బ్రీడ్‌లను తెచ్చుకుని మరీ పెంచుతుంటారు. మంచు లక్ష్మీ దగ్గర ఉండే పెట్ మన ఇండియాలో మొట్టమొదటి బ్రీడ్ అని అంటారు. అలా వారు ఇతర దేశాల నుంచి బ్రీడ్‌లను తెచ్చుకుని పెంచుకుంటారు. తాజాగా రష్మీ వేసిన పోస్ట్ అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తోంది.
మన వాళ్లే అలా చేస్తున్నారన్న రష్మీ Rashmi Gautam
అలాంటి వారిపై ఇప్పుడు యాంకర్ రష్మీ సెటైరికల్‌గా స్పందించారు. అందరూ బ్రీడ్‌లంటూ విదేశాల నుంచి కుక్కలను తెచ్చుకుని పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. కానీ మన వీధికుక్కలను మాత్రం పట్టించుకోరు. వాటిపై ప్రేమను కనబర్చరు. వాటిని రకరకాలుగా హింసిస్తుంటారు. ఎన్ని కుక్కలు వీధుల్లో అనాథులు తిరుగుతుంటాయో అందరికీ తెలిసిందే. ఇక కుక్కలపై జరిగే దాడుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అలాంటి వారి కోసం రష్మీ తాజాగా ఓ పోస్ట్ చేసింది. ఆకలి, ఒంటరితనం, ఎవ్వరూ లేకపోవడం అనేది భరించలేం.. భారతీయులుగా మనం మన పెట్స్‌ను మెచ్చుకోక, పెంచుకోక వదిలేస్తున్నాం.. మనమే వాటిని పట్టించుకోక పోతే ఇంకెవ్వరు వాటి గురించి పట్టించుకుంటారు అని రష్మీ ఆవేదన చెందింది. కుక్కలను కొనకండి.. దత్తత తీసుకోండి అని రష్మీ నిత్యం చెబుతూనే ఉంటుంది. అలా రష్మీ ఇంట్లో ఎన్నో పెట్స్ ఉన్నాయి. ఆ మధ్య వీదుల్లో గాయపడిన కుక్కను తెచ్చుకుని పెంచుకుంటోన్న సంగతి తెలిసిందే.