Rashmi Gautam : రష్మీ పెళ్లి జరగాలంటే కచ్చితంగా అది జరగాలి .. ఆడేసుకుంటున్న నెటిజన్స్..!

Advertisement

Rashmi Gautam : ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అవుదామని వచ్చిన రష్మీ యాంకర్ గా సెటిల్ అయిపోయింది. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా రష్మీ ఎంత పాపులారిటీని సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ఆమెకు లైఫ్ ని ఇచ్చింది అని చెప్పవచ్చు. అప్పుడప్పుడు సినిమాలలో కూడా చేస్తూ బుల్లితెరపై పలు ఈవెంట్లలో సందడి చేస్తూ ఉంటుంది. అయితే ఆమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లకు పైనే అవుతుంది అయినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. రష్మీ ఇంత వయసు వచ్చిన సరే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని జనాలు ఇప్పటికే చర్చించుకుంటూ నే ఉంటారు.

Advertisement

కొందరు సుధీర్ కోసం రష్మీ పెళ్లి చేసుకోవడం లేదు అని అంటుంటే మరికొందరు తన అమ్మని వాళ్ళ నాన్న చీట్ చేశాడని ఆ కారణం చేత రష్మి పెళ్లిపై ఆసక్తి చూపడం లేదని, అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. అయితే చాలామంది మాత్రం రష్మీకి పెళ్లి అయితే ఆఫర్లు రావని అందుకే ఆమె పెళ్లి చేసుకోవడం లేదని అంటున్నారు, ఆమెకు అవకాశాలు తగ్గితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని, పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్లు ఉంటుంది అని నెటిజెన్లు కౌంటర్స్ వేస్తున్నారు.

Advertisement
Anchor Rashmi Gautam marriage news
Anchor Rashmi Gautam marriage news

అయితే చాలా కాలంగా సుధీర్ రష్మీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ సుధీర్ రష్మీ తాము కేవలం స్నేహితులం మాత్రమే అని, మా మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పుకొస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. బుల్లితెరపై సుధీర్ రష్మి ల జోడి కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇక ఇటీవల వీరిద్దరూ బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. హీరోగా సుధీర్ పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక రష్మీ బుల్లితెరపై పలు షోలు చేస్తూ గడుపుతుంది.

Advertisement
Advertisement