Anchor Ravi : ఏడాదికి ఒకసారి ఆ పని చేయాల్సిందే.. యాంకర్ రవి కామెంట్స్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: July 26, 2021, 8:43 pm

Anchor Ravi  యాంకర్ రవి Anchor Ravi  బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో సోషల్ మీడియాలోనూ అంతే అల్లరి చేస్తుంటాడు. సోషల్ మీడియాలో రవికి వేరే లెవెల్ ఫాలోయింగ్ ఉంటుంది. రవి తన భార్య నిత్య, పాప వియాతో కలిసి చేసే అల్లరి పనులు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఇక తన కూతురు కోరితే ఏదైనా చేసే రవి ఆమె కోసం వంట మనిషిగా మారుతుంటాడు. ముద్దుల కూతురు కోరిందని చికెన్, మటన్ వండేశాడు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Anchor Ravi About Body health check up

Anchor Ravi About Body health check up

ప్రతీ ఏడాదికి ఒకసారి..  యాంకర్ రవి  Anchor Ravi

ఇక రవి ఇప్పుడు తన ఫ్యామిలీ మొత్తానికి బిజీగా ఉంచేందుకు రెడీ అయ్యాడు. భార్య, పాపను సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ చేసేశాడు. కూతురు వియాకు స్పెషల్ ఇన్ స్టా అకౌంట్, యూట్యూబ్ చానెల్ పెట్టించేశాడు. వాటి పనులను రవి భార్య నిత్య దగ్గరుండి మరీ చూసుకుంటోంది. అలా వియా చేసే చిలిపి పనులు కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అయితే రవి ఇప్పుడు షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. స్పెషల్ ఈవెంట్లతో దూసుకుపోతోన్నాడు.

Anchor Ravi About Body health check up

Anchor Ravi About Body health check up

ఇంత బిజీగా ఉన్నా కూడా రవి మాత్రం ఏడాదికి ఒకసారి ఫుల్ బాడీ చెకప్ టెస్టులు చేయించుకుంటాడట. తాజాగా తన చెకప్‌లకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ప్రతీ ఏడాదికి ఒకసారి బాడీ చెకప్ చేయించుకోవాల్సిందే. ఇక అమ్మ నాన్నలకు అయితే ఆరు నెలలకు ఒకసారి చేయిస్తాను అని అన్నాడు. మొత్తానికి రవికి హెల్త్ మీద ఎంతో ముందు జాగ్రత్త ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకు రక్త చరిత్ర పాటను యాడ్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp