Rashmi Gautam : రాత్రంతా బిజీ బిజీగానే.. రష్మీతో యాంకర్ రవి
Rashmi Gautam : బుల్లితెరపై పాపులర్ యాంకర్స్‌లో రవి ఒకరు. ప్రస్తుతం ఫీమేల్ యాంకర్స్ సత్తా చాటుతున్న సమయంలో మేల్ యాంకర్ అయిన రవి తన మాటలతో అదరగొట్టేస్తున్నాడు. బిగ్ బాస్ షోలో కూడా మనోడి రచ్చ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 5లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన రవి 12వ వారంలో బయటకు వచ్చాడు. ప్రస్తుతం మనోడు బిగ్ బాస్ ఓటీటీ బజ్ షోని హోస్ట్ చేస్తున్నాడు. అయితే యాంకర్‌గాను, హీరోగాను రవి అదరగొడుతూనే ఉన్నాడు. అయితే రవికి సరైన జోడిగా శ్రీముఖి, లాస్య చాలా ఫేమస్ అయ్యారు. మధ్యలో వీరిద్దరు రవికి కాస్త దూరమైన ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు.
ఇక సుడిగాలి సుధీర్- యాంకర్ రష్మీ.. ఈ ఇద్దరిపై ఎన్ని రకాల వార్తలొచ్చినా అస్సలు బోర్ కొట్టదు. సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ గురించి ఎన్ని స్కిట్స్ చేసినా, వాళ్ళిద్దరికీ ఎన్ని సార్లు పెళ్లి చేసినా ఈ కిక్కులో ఉండే ఫ్రెష్‌నెస్ మాత్రం మాసిపోదు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా రష్మీ- సుధీర్‌ల లవ్ ట్రాక్‌పై ఫోకస్ పెడుతుంటారు ఈవెంట్ నిర్వాహకులు. దీంతో టీవీ ఛానల్స్‌కి భారీ టీఆర్ఫీ దక్కడమే గాక సుడిగాలి సుధీర్- రష్మీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు రష్మీ-రవి జంట ఓ షోతో సందడి చేసేందుకు సిద్ధమైంది.
Rashmi Gautam : పాపం ఎన్ని కష్టాలు..
తాజాగా రవి తన ఇన్‌స్టాగ్రాములో పలు ఫొటోలతో పాటు వీడియోలు షేర్ చేశాడు. అయితే ఓ వీడియోలో రవి, రష్మీ కలిసి షోని హోస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. తెల్లవారుజామున కూడా వీరంతా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. చాలా గ్యాప్ తర్వాత రష్మి, రవి కలిసి సందడి చేయనుండడంతో ఈ షోపై అందరిలో ఆసక్తి నెలకొంది. కాగా, యాంకర్ రష్మీ గౌతమ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతుంది. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు.