Bigg Boss OTT Telugu : ఫ‌స్ట్ నైట్ చేస్తావా అంటూ అరియానా.. ఎన్నో నైట్ అంటూ శివ.. నోటిదూల త‌గ్గించుకోమ‌ని వార్నింగ్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Bigg Boss OTT Telugu : ఫ‌స్ట్ నైట్ చేస్తావా అంటూ అరియానా.. ఎన్నో నైట్ అంటూ శివ.. నోటిదూల త‌గ్గించుకోమ‌ని వార్నింగ్

Big Boss OTT : బిగ్ బాస్ అంటేనే కొట్లాట‌లు, తిట్టుకోవ‌డాలు, ఇష్టం వ‌చ్చిన‌ట్టు రొమాన్స్ చేయ‌డాల‌కు వేదిక‌గా మారింద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ అంటూ నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ పేరిట ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ లో కూడా అనేక గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే రోజుకో ర‌చ్చ బిగ్ బాస్ లో వెలుగు చూస్తూనే ఉంది. […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 April 2022,11:00 am

Big Boss OTT : బిగ్ బాస్ అంటేనే కొట్లాట‌లు, తిట్టుకోవ‌డాలు, ఇష్టం వ‌చ్చిన‌ట్టు రొమాన్స్ చేయ‌డాల‌కు వేదిక‌గా మారింద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ అంటూ నాన్ స్టాప్ ఎంట‌ర్ టైన్ మెంట్ పేరిట ప్ర‌సారం అవుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ లో కూడా అనేక గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే రోజుకో ర‌చ్చ బిగ్ బాస్ లో వెలుగు చూస్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు బిగ్ బాస్ లో బూతులు తిట్టుకోవ‌డాన్ని మాత్ర‌మే చూశాం. కానీ ఇప్పుడు మాత్రం అంత‌కు మించి అన్న‌ట్టు ర‌స‌వ‌త్త‌రంగా బూతులు, రొమాన్స్ పండుతోంది. ఈ సారి లేడీస్ కూడా ప‌చ్చి బూతుల‌తో రెచ్చిపోతున్నారు.ఆడ మగ అనే తేడా లేకుండా అంద‌రూ రెచ్చిపోతూ హౌస్‌లో రెచ్చిపోతున్నారు. అజయ్, అషు రెడ్డి అయితే చెప్పాల్సిన పనిలేదు.

నోరు తెరిస్తే బూతులు.. సెక్స్ గురించి పచ్చిగానే మాట్లాడుకున్నారు వీళ్లిద్దరూ. ఇక అఖిల్-నటరాజ్ మాస్టర్‌లు అయితే చార్జింగ్ పెట్టడానికి పిన్ పట్టుకుని తిరుగుతున్నారు అంటూ డబుల్ మీనింగ్‌లో పచ్చిగా మాట్లాడుకున్నారు. వీళ్లు నోరు తెరిస్తే గలీజ్ మాటలు తప్పితే మంచి మాటలు వచ్చేట్టుగా లేని పరిస్థితుల్లో.. ఇంకా రెచ్చిపోండి అన్నట్టుగా శుక్రవారం ఎపిసోడ్‌లో టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇంకేముంది రెచ్చిపోయారు కంటెస్టెంట్స్.ఈ టాస్క్‌లో వారి వారి జీవితాల్లో జరిగిన ఘటనలు.. పిచ్చి పనులు.. వేసిన వేషాలపై ఓపెన్ కావాలని చెప్పారు. దీనిలో భాగంగా ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి చెప్పుకుని వచ్చారు. అయితే హమీదా.. తాను ఈవెంట్ మేనేజర్‌గా స్టార్టింగ్‌లో చేసిన చిలిపి పనుల గురించి చెప్పుకొచ్చింది. ఫేక్ ఎక్స్ పీరియ‌న్స్ తో ఓ ఈవెంట్ ఒప్పుకోగా చేయ‌లేపోతే లాస్ట్ కి ఫ‌స్ట్ నైట్ ఈవెంట్ ఆర్గ‌నైజ్ చేయ‌మ‌ని అడ‌గ్గా మొహాలు చూసుకున్నార‌ట‌.

anchor shiva comments on ariyana first night

anchor shiva comments on ariyana first night

దీంతో అదికూడా మిస్సైంద‌ని చెప్పింది. అయితే ఆ తరువాత ఈవెంట్ మేనేజింగ్‌ని సీరియస్‌గా తీసుకున్నా అని.. ఇప్పుడు దుబాయ్‌లో ఈవెంట్ మేనేజర్‌గా చేస్తున్నానని చెప్పింది హమీదా.కాగా అరియానా ఇన్వాల్వ్ అవుతూ ఎప్పుడైనా ఫస్ట్ నైట్‌లు చేశావా? ఇప్పుడు ఇస్తే చేస్తావా? అని అడిగింది. ఇప్పటివరకూ చేయలేదు కానీ.. నీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేయమంటే చేస్తా కావాలా చెప్పు అని అంటే.. అరియానా తెగ సిగ్గుపడిపోతూ కావాలని చెప్పింది. అవును అరియానా ఫస్ట్ నైట్‌కి మాత్రమే చేస్తా.. ఫస్ట్ నైట్ రోజు ఆ గదిలో అరియానా స్టోరీలు మొత్తం ఫొటోలుగా పెడతా అని చెప్పింది. ఆ మాటతో అరియానా.. ఎందుకే ఆ టైంలో డిస్టబెన్స్ అని అన్నది.ఇంతలో యాంకర్ శివ తన నోటిదూల చూపించాడు. షో స్టార్టింగ్‌లో సరయుతో పిండి పిసకడం గురించి శివ ఎంత దారుణంగా మాట్లాడాడో తెలిసిందే..

ఇప్పుడు అదే తరహాలో మళ్లీ రెచ్చిపోయాడు.అన్ని ఫొటోలు పెట్టి.. చివర్లో ఎన్నో నైట్ అన్నదో కూడా ఓ బోర్డ్ పెట్టు అని అన్నాడు. ఆ మాటని హమీదా హైలైట్ చేస్తూ శివ ఏంటో చెప్తున్నాడు. ఎన్నో నైటో బోర్డ్ పెట్టమంటున్నాడు అని చెప్పడంతో అరియానా ఆ టైంలో రియాక్ట్ కాలేదు.ఆ తరువాత యాంకర్ శివని పక్కకి పిలిచి ఏం అన్నావ‌ని అడిగింది. ఎన్నో నైట్ అని అన్నాను అని శివ అన్నమాటని ఒప్పుకున్నాడు. ఎందుకురా.. అక్కడ ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటే నువ్ ఎన్నో నైట్ అనడం అని అడిగింది. దాంతో శివ ఫస్ట్ నైట్ రోజు ఎవరైనా పాత ఎక్స్ ఫొటోలు పెడతారా అన్న ఉద్దేశంలో అన్నానంతే అని కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా అదంతా అనవసరం.. నువ్ అలా మాట్లాడటం సెన్సిబుల్ అనిపించిందా? ఈ టైప్ జోక్‌లు వేయక‌ని ముందు నువ్ నోటి దూల తగ్గించుకో అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో శివ అరియానాకి సారీ చెప్ప‌డంతో స‌ద్దుమ‌ణిగింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది