Anchor Suma : అతను ఎప్పుడూ టార్చర్ పెడుతుంటాడట.. యాంకర్ సుమ మామూల్ది కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : అతను ఎప్పుడూ టార్చర్ పెడుతుంటాడట.. యాంకర్ సుమ మామూల్ది కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,5:00 pm

Anchor Suma : యాంకర్ సుమ బాబా భాస్కర్ కాంబో ఎప్పుడూ హైలెట్‌గానే ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి చేసే ప్రోగ్రాంలు హైలెట్ అవుతుంటాయి. అందులో ఈ ఇద్దరూ ఒకరి మీద ఇంకొకరు వేసుకునే పంచ్‌లు అందరికీ నవ్వులు పంచుతుంటాయి. క్యాష్ షోలో అయినా, స్టార్ మా స్పెషల్ ఈవెంట్లలోనైనా, బిగ్ బాస్ స్టేజ్ మీదైనా కూడా సుమ, బాబా భాస్కర్ కాంబో అదిరిపోతుంటుంది. బాబా మాస్టర్ చేసే అల్లరిని సుమ భరించలేకపోతుంది. ఇక బాబా భాస్కర్ వయసు మీద సుమ, సుమ వయసు మీద బాబా భాస్కర్ పంచ్‌లు వేస్తుంటారు. తాజాగా బోనాల ఈవెంట్‌ను స్టార్ మాలో చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు.

దీనిపై సుమ ఓ వ్లాగ్ చేసింది. బిహెండ్ సీన్స్ అంటూ సుమ యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను వదిలింది. అందులో సుమ చేసిన ఫన్ చూస్తే అందరూ పగలబడి నవ్వాల్సిందే. సుమ తాను ఎలా రెడీ అవుతుందో చూపించింది. స్టార్ మా ఈవెంట్ కోసం ఎలా రెడీ అయిందో చూపించింది. ఇక సెట్స్‌లో షూటింగ్ ఎలా జరుగుతుంది? ఎలా ఉంటారు.. ఎంత సేపు ఉంటారు అని చెప్పుకొచ్చింది. మామూలుగా అయితే ఇలాంటి ఈవెంట్లు పగలు రాత్రి అని తేడా లేకుండా జరుగుతుంటాయని అంది. కానీ తాను మాత్రం సాయంత్రం ఆరు అయితే వెళ్లిపోతాను అని చెప్పేసింది. ఇక ఈ వీడియోలో ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ చూపించింది.

Anchor Suma ABout Baba Bhaskar Annoying in Star Maa Bonalu Event

Anchor Suma ABout Baba Bhaskar Annoying in Star Maa Bonalu Event

ఇందులో అవినాష్, బాబా భాస్కర్‌లు సుమ ప్రాణాలు తీసేశారు. తమ యూట్యూబ్ చానెళ్లను సబ్ స్క్రైబ్ చేసుకోండని అవినాష్, బాబా భాస్కర్‌లు సుమ వీడియోలోకి వచ్చి చెప్పారు. దీంతో సుమ తల పెట్టేసుకుంది. అయితే సుమ బాబా భాస్కర్ మీద తన అభిప్రాయాన్ని చెప్పింది. ప్రతీ ఈవెంట్‌లో తనను ఒకరు టార్చర్ పెడుతుంటారు.. అతను ఇతనే అని బాబా భాస్కర్‌ను చూపిస్తుంటుంది సుమ. ఇక బాబా భాస్కర్ అది గమనించి ఆమె చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. మొత్తానికి సుమ, బాబా భాస్కర్ కాంబో మాత్రం మామూలుగా ఉండదని మరోసారి ఈ ఈవెంట్‌తో చూపించబోతోన్నారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది