Anchor Suma : బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్ట‌బోతున్న యాంక‌ర్ సుమ‌.. ఎందుకో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: April 2, 2022, 9:30 pm

Anchor Suma : బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది యాంక‌ర్ సుమ‌. చలాకీతనం.. వాక్చాతుర్యంతో టాప్ యాంకర్‏గా దూసుకుపోతుంది. పలు టీవీ షోస్.. ఇటు ప్రీరిలీజ్ ఈవెంట్స్.. సక్సెస్ మీట్స్ అంటూ తెగ బిజీగా గడిపేస్తుంది. ఇక ఇటీవల సోషల్ మీడియా సుమ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తన మాటల గారడితో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మలయాళి అమ్మాయి అయిన.. తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత వెండితెర‌కు దూరంగా ఉంటూ

పూర్తిగా బుల్లితెరకు అంకితమైంది సుమ. అయితే సోష‌ల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ అల‌రిస్తుంది.సుమ రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో బిగ్ బాస్ హౌజ్‌కి వెళ్ల‌బోతున్న‌ట్టు తెలిపింది. కంటెస్టెంట్‌గా కాకుండా తాను న‌టించిన జ‌య‌మ్మ పంచాయ‌తీ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా సుమ హౌజ్‌లోకి వెళ్ల‌నుంది.అందుకోసం మూడో సారి క‌రోనా టెస్ట్ చేయించుకున్న‌ట్టు తాను తెలియ‌జేసింది. జ‌య‌మ్మ పంచాయ‌తీ సినిమా ద్వారా చాలా రోజుల‌కి సుమ వెండితెర‌పై అల‌రించ‌బోతుంది. ఆమె చేసే సంద‌డి ఎలా ఉంటుందో అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

Anchor Suma about to enter Bigg Boss House

Anchor Suma about to enter Bigg Boss House

Anchor Suma : కరోనా టెస్ట్..

ఇటీవ‌ల సుమ తన సోషల్ మీడియా ఖాతాలో తన కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో సుమ కొడుకు రోషన్ పూర్తిగా మారిపోయి సరికొత్త లుక్‏లో హీరోలకు ఏమాత్రం తీసిపోడు అనే విధంగా ఉన్నాడు. మార్చి 15న రోషన్ పుట్టినరోజు కావడంతో తన కొడుకుతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలను సుమ షేర్ చేసింది. అయితే రోషన్‏కు బర్త్ డే విషెష్ చెబుతూ.. నెటిజన్స్ ఆ ఫోటోలను చూసి షాకవుతున్నారు.. రోషన్ ఇంతలా మారిపోయాడేంటీ.. అప్పుడే హీరోలా అయ్యడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుమ, రోషన్ తల్లికొడుకుల్లా లేరని.. అక్క తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్స్ చేసారు.

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp