Anchor Suma : యాంకరింగ్ కి గుడ్ బై చెబుతూ..యాంకర్ సుమ షాకింగ్ నిర్ణయం..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 27 December 2022, 6:00 pm

Anchor Suma : యాంకర్ సుమ అందరికీ సుపరిచితురాలే. ఇండస్ట్రీలో అనేక సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో యాంకరింగ్ చేస్తూ.. వేడుక సక్సెస్ కావడంలో కీలకపాత్ర పోషించేది. ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద హీరోల ఆడియో వేడుకలు ఇంకా సక్సెస్ మీట్… వంటి వాటికి ఎక్కువగా సుమానే ఎంచుకునేవారు. ఇండస్ట్రీ పెద్దలను ఇంకా స్టార్ హీరోలను కుర్ర హీరోలను… తనదైన శైలిలో మాటలు మాట్లాడుతూ బ్యాలెన్స్ వాతావరణంలో..

అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించడంలో సుమ సిద్దవస్తురాలు. ఇండస్ట్రీలో ఎప్పటినుండో యాంకరింగ్ చేస్తూ ఉంది. ఇండస్ట్రీలో చాలామంది పెద్ద హీరోలు సుమా యాంకరింగ్ కి అభిమానులు. బహిరంగ ఈవెంట్లకు సంబంధించి ఎటువంటి పరిస్థితినైనా చాలా తెలివిగా హ్యాండిల్ చేయడంలో.. సుమ స్పెషాలిటీ వేరు. బుల్లితెరలో కూడా పలు టీవీ షోలకు సుమ యాంకరింగ్ గా రాణించటం జరిగింది. దాదాపు 15 సంవత్సరాలుగా

Anchor suma decision on Good bye to anchoring

Anchor suma decision on Good bye to anchoring

యాంకరింగ్ రంగంలో తిరుగులేని యాంకర్ గా నిలిచింది. తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో.. ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటది. ఈ క్రమంలో ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న అభిమానులకు షాకింగ్ న్యూస్ తెలియజేసింది. తాను యాంకరింగ్ కీ బ్రేక్ ఇస్తున్నట్లు ఎమోషనల్ అయింది. మలయాళీ అయినా గాని నన్ను తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో పెట్టుకుని ప్రేమించారు అని కన్నీరు పెట్టుకుంది. దీంతో సుమ తాజా నిర్ణయం అందరికీ షాక్ కీ గురి చేసింది.

 

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp