Anchor Suma : ఎక్కడికెళ్లినా అదే పనా?.. ఇంద్రనీల్ మేఘన పరువుతీసిన సుమ
Anchor Suma బుల్లితెరపై తమదైన ముద్ర వేసిన ఇంద్రనీల్, మేఘన దంపతులకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. వీరి జంట ఎక్కడికి వెళ్లిన ఫుల్ అల్లరి చేస్తుంది. సీరియల్స్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఓ సీరియల్‌లో అత్తా, అల్లుడిగా నటించిన ఈ ఇద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు. చక్రవాకం, మొగలి రేకులు సీరియల్స్ ఇంద్రనీల్, మేఘన కేరీర్‌లో అలా నిలిచిపోతాయి. యాక్టింగ్‌లో ఇద్దరు తమదైన నటనతో మెప్పిస్తారు.

anchor suma funny counter on indraneel and meghana couple
అయితే ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్స్‌లో స్టార్‌గా ఉన్న ఇంద్రనీల్.. ఈ మధ్య కాలంలో సీరియల్స్‌లో ఎక్కువగా కనిపించడం లేదు. మరోవైపు మేఘన మాత్రం పలు సీరియల్స్‌లో సందడి చేస్తుంది. తన నటనతో మెప్పిస్తోంది. ఏ సీరియల్‌లోనైనా తన పాత్రకు మంచి వెయిట్ ఉండేలా చూసుకుంటుంది. అందుకే ఆమె నటించే పాత్రలు జనాలకు కూడా నచ్చుతాయి. ఇంద్రనీల్ సీరియల్స్‌లో కనిపించకపోయినా.. భార్యతో కలిసి పలు టీవీ షోలకు హాజరవుతున్నాడు.
Anchor Suma : జంటపై సుమ కౌంటర్లు..
తాజాగా క్యాష్ షోకు వచ్చిన ఈ జంట నవ్వులు పూయించింది. వీరిపై సుమ వేసిన పంచులు ఓ రేంజ్‌లో పేలాయి. తొలుతు ఎంట్రీలో స్టేజిపైకి రాగానే కిస్ చేసుకుంటారు.. అది చూసిన సుమ.. అర్జున్ రెడ్డి తర్వాత వీళ్లు వచ్చినప్పుడే ఎక్కువ ముద్దులు చూసింది అంటూ డైలాగ్ వదిలింది. ఆ తర్వాత.. క్యాష్ కంటే మంచి హనీమూన్ ఉంటుందా అని మేఘన అనడంతో.. సుమ కూడా ఫన్నీ కౌంటర్ ఇచ్చింది. మీరు ఎక్కడికో వెళ్లరు హనీమూన్.. మీరు వెళ్లిన చోటునే హనీమూన్ చేస్తుంటారు అని ఫన్నీగా కౌంటర్ వేసేసింది. అయితే ఇంద్రనీల్, మేఘనలు కూడా చాలా లైట్‌గా తీసుకున్నారు.
