Anchor Suma : దానికి నాకు ఏ సంబంధం లేదు!.. రాజీవ్ కనకాలకు ముందే సూచించిన సుమ
Anchor Suma : యాంకర్ సుమ ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్షణం తీరిక లేకుండా వరుసగా షోలు, ఈవెంట్లు అంటూ తిరుగుతూనే ఉంటుంది. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని చానెళ్లలో, అందరి హీరోల ఫంక్షన్లలో సుమ కనిపిస్తుంటుంది. అయితే సుమ పర్సనల్ లైఫ్ గురించి మాత్రం ఎప్పుడూ ఏదో ఒక నెగెటివ్ వార్త కనిపిస్తూనే ఉంటుంది. వినిపిస్తూనే వస్తుంది.సుమ, రాజీవ్ కనకాల మధ్య విబేధాలు వచ్చాయని, ఇద్దరూ విడిపోయారని, వేర్వేరుగా ఉంటున్నారంటూ రకరకాల కథనాలు వచ్చాయి. అయితే వీటిని ఖండించేందుకు రాజీవ్ కనకాల ప్రయత్నించాడు.
భార్యభర్తలన్నాక గొడవలు సహజం, కానీ మీడియా అనుకున్నంతగా రాలేదు.. విడిపోలేదు.. అవన్నీ అవాస్తవాలే అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు. ఇక సుమ సైతం తన సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా స్పందిస్తుంటుంది.సుమ, రాజీవ్ కనకాల ఇద్దరూ కూడా తమ తమ షోల ప్రమోషన్ల కోసం వస్తుంటారు. రాజీవ్ కనకాల బుల్లితెరపై మెరిసి చాలా కాలమే అవుతోంది. రెచ్చిపోదాం బ్రదర్ అంటూ వచ్చాడు. కానీ అంతగా క్లిక్ అవ్వలేదు. మొత్తానికి సుమ, రాజీవ్‌లు మాత్రం తమ కొడుకు రోషన్‌ను హీరోగా లాంచ్ చేసేందుకు రెడీ అయ్యారు.

Anchor Suma on rajeev kanakala In Jabardasth Show For Jayamma Panchayathi
కరోనా సమయంలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే తాజాగా సుమ జబర్దస్త్ షోకు వచ్చింది.జయమ్మ పంచాయితీ సినిమా ప్రమోషన్లో భాగంగా సుమ జబర్దస్త్ షోకు వచ్చింది. ఇందులో భాగంగా వెంకీ మంకీ, తాగుబోతు రమేష్ స్కిట్ వేశారు. ఇందులో వెంకీ రాజీవ్ వెనకాల అంటూ ఓ కామెడీ స్పూప్ వేశాడు. సుమ వెనకాల ఉంటూ రాజీవ్ వెనకాల అయ్యాను అంటూ కౌంటర్ వేస్తాడు. దీంతో సుమ అప్రమత్తమైంది. ఈ స్కిట్‌కు నాకు ఎలాంటి సంబంధం లేదు రాజా అంటూ భర్తకు ముందుగానే విన్నవించుకుంది సుమ.
