Anchor Suma : ప్రముఖ నిర్మాతతో ‘మీకో దండం నావల్ల కాదు’ అని చెప్పిన యాంకర్ సుమ

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 5 February 2023, 10:00 am

Anchor Suma ; యాంకర్ గా సుమ లేడీ సూపర్ స్టార్ అనడంలో సందేహం లేదు. బుల్లి తెరపై ఆమె ఏ కార్యక్రమం చేసినా కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తుంది. ప్రతి కార్యక్రమం ఆమె వల్ల రికార్డ్ స్థాయి రేటింగ్ సొంతం చేసుకుంటూ ఉంటుంది. బుల్లి తెరపై లేడీస్ సూపర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సుమ వెండి తెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు జయమ్మ పంచాయితీ అనే సినిమాను చేసింది.

anchor suma says no to movie producer for new film

anchor suma says no to movie producer for new film

ఆ సినిమాలో సుమ ఎందుకు చేసిందో కూడా అర్థం కాలేదు అంటూ స్వయంగా మా అభిమానులు జుట్టు పీక్కున్నారు. ఇలాంటి సినిమా ఒకటి సుమ చేస్తుందని తాము కలలో కూడా అనుకోలేదని చాలా మంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సినిమా సుమ వీరాభిమానులకు కూడా నచ్చలేదు అంటే ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమ జయమ్మ పంచాయతీ ఫ్లాప్ అయినా కూడా ఆమెతో సినిమాలు నిర్మించేందుకు పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

anchor suma says no to movie producer for new film

anchor suma says no to movie producer for new film

ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత సుమ ని కలిసి ఒక మంచి స్క్రిప్ట్ ఉంది, భారీ రెమ్యూనరేషన్ ఇస్తాను నటించాల్సిందిగా కోరాడట. సుమా అందుకు సున్నితంగా నిరాకరించందని.. మీకో దండం, సినిమాలు చేయడం నావల్ల కాదు అన్నట్లుగా ఆ నిర్మాతతో సరదాగా సుమ మాట్లాడారట. ఒక్క జయమ్మ పంచాయతీ సినిమా తో సుమ లో చాలా మార్పు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి