Anchor suma : సుమ ‘క్యాష్’ కార్యక్రమంపై జనాల్లో తగ్గుతున్న ఆధరణ.. మూడు కారణాలు
Anchor suma : ఈ టీవీలో ప్రసారం అయ్యే మల్లెమాల వారి జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, క్యాష్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ఇతర షో లు ఆ చానల్ కి మంచి రేటింగ్ అని తెచ్చిపెడుతున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ మధ్య కాలంలో మల్లెమాల వారి షో లు కాస్త బోర్ కొడుతునాయి అంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షో విషయంలో ఆ చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో కాదు కానీ జబర్దస్త్కు కాస్త క్రేజ్ అయితే తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సుమ యాంకరింగ్ చేస్తున్న క్యాష్ కార్యక్రమానికి కూడా మెల్ల మెల్లగా ఆదరణ తగ్గుతోంది. క్యాష్ కార్యక్రమానికి ఆదరణ తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు.
మొదటిది షో కి తీసుకు వస్తున్న సెలబ్రిటీలు. రెండవది ఒకే తరహా ఫార్మాట్ లో షో కొనసాగుతూ వస్తుంది. ఇంకా క్యాష్ టెలికాస్ట్ అయ్యే సమయంలో వేరే ఛానల్ లో మంచి కార్యక్రమాలు ప్రసారం కావడం. ఈ మూడు కారణాల వల్ల ఈ టీవీ లో ప్రసారం అవుతున్న క్యాష్ కార్యక్రమానికి గత కొన్నాళ్లుగా ఆదరణ తగ్గుతోంది అంటూ బుల్లి తెర వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఒకప్పుడు పెద్ద ఎత్తున రేటింగ్ దక్కించుకున్న క్యాష్ కి ఇప్పుడు నామమాత్రపు రేటింగ్ మాత్రమే వస్తోంది. అయినా కూడా షో నిర్వాహకులు కంటిన్యూ చేస్తున్నారు. సుమ సుదీర్ఘ కాలంగా చేస్తున్న షో అవ్వడం వల్ల కచ్చితంగా మల్లెమాల వారికి మరియు ఈ టివి వారికి ఒకింత గౌరవం ఉంది. ఆ గౌరవం వల్లే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
లాభం లేకుండా.. ఆదాయం లేకుండా షో కంటిన్యూ చేయడం చాలా కష్టమైన పని.. సుమ కోసం అంటూ చేయడం మరింత భారాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతానికి క్యాష్ కార్యక్రమం ఒక మోస్తరు రేటింగ్ దక్కించుకుంటున్నా.. భవిష్యత్తులో కార్యక్రమానికి మరింతగా దారుణమైన రేటింగ్ నమోదయ్యే అవకాశాలు లేక పోలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళే వస్తున్నారు.. ఆడించిన ఆటలు ఆడుతున్నారు. కనుక క్యాష్ కార్యక్రమాన్ని చూసేదేముంది అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. కొత్త వారిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే కనీసం మొహం కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని తీసుకు రావడం వల్ల ఉపయోగం ఉండదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే క్యాష్ కార్యక్రమం ముందు ముందు గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన రావచ్చు. ఇప్పటికి కూడా కొందరు క్యాష్ ను అమితంగా ఆధరిస్తున్నారు. రేటింగ్ పెరగాలంటే టీమ్ కొత్తగా ప్రయత్నించాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.