Anchor Varshini : రహస్య ప్రేమలేఖలు, బహుమతులు.. అలా వేడుకున్న యాంకర్ వర్షిణి!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 15 August 2021, 1:30 pm

Anchor Varshini  యాంకర్ వర్షిణి Anchor Varshini ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉందన్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు కామెడీ స్టార్స్ షోలో యాంకర్‌గా బాగానే రాణించింది. కానీ అకస్మాత్తుగా ఆ షో నుంచి కూడా వర్షిణి తప్పుకుంది. అయితే దీనిపై రకరకాల కారణాలు బయటకు వినిపిస్తున్నాయి. సినిమా చాన్సులు రావడంతోనే ఇలా బుల్లితెరకు గుడ్ బై చెప్పిందని, బిగ్ బాస్ ఆఫర్ రావడంతో షో నుంచి బయటకు వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అయితే వీటిలో ఏది నిజమన్నది మాత్రం ఎవ్వరికీ తెలియడం లేదు.

Anchor Varshini Gets Love letters And Gifts

Anchor Varshini Gets Love letters And Gifts

రహస్య ప్రేమలేఖలు, బహుమతులు..  యాంకర్ వర్షిణి Anchor Varshini

కానీ వర్షిణి Anchor Varshini ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ చెబుతూ పోజులు ఇస్తోంది. సినిమా షూటింగ్‌లతో వర్షిణి బాగానే దూసుకుపోతోన్నట్టుంది. సమంత శాకుంతలం సినిమాలో వర్షిణి ఓ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తయింది. ఇక సుమంత్ మళ్లీ మొదలైంది చిత్రంలోనూ వర్షిణి నటించనుంది. అయితే ఇక బిగ్ బాస్ షోలో కనిపిస్తుందా? లేదా? అన్నది ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.

Anchor Varshini Gets Love letters And Gifts

Anchor Varshini Gets Love letters And Gifts

అయితే తాజాగా వర్షిణి Anchor Varshini తన ఇంటి ముందు వస్తున్న రహస్య ప్రేమ లేఖలు, బహుమతులను చూసి షాక్ అయింది. వాటిపై స్పందిస్తూ.. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలియడం లేదు.. దీనిపై ఎన్నడూ కూడా స్పందించాలనుకోలేదు. ఇలా నాలుగైదు సార్లు వచ్చింది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. మీ ప్రేమకు థ్యాంక్స్. నాకోసం ఇంత సమయాన్ని ఇస్తున్నందుకు థ్యాంక్స్. ఎలా రియాక్ట్ కావాలో కూడా నాకు తెలియడం లేదు. కానీ దయచేసి మీ సమయాన్ని వృథా చేసుకోవద్దు. మీరు మీ పని మీద శ్రద్ద పెట్టి సక్సెస్ అయితే నేను ఇంకా హ్యాపీగా ఉంటాను. మీకు అంతా మంచే జరగాలి.. థ్యాంక్యూ అని వర్షిణి దండం పెట్టేసింది. ఇంతకీ ఆ రహస్య ప్రేమికుడు ఎవరో మరి.

Anchor Varshini Gets Love letters And Gifts

Anchor Varshini Gets Love letters And Gifts

ఇది కూడా చ‌ద‌వండి ==> బిగ్‌బాస్‌లోకి పాపులర్ డ్యాన్స్ మాస్టర్ కపుల్ ఎంట్రీ..పోల్ పెట్టిమరీ లీక్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> తమన్నాకి అదంటే బాగా ఇష్టమట..నెలకి ఎన్నిసార్లు వెళుతుందో

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆహా ఏమీ అందం చీరకట్టిన చందమామ !!.. యాంకర్ విష్ణుప్రియ పిక్స్ వైరల్

ఇది కూడా చ‌ద‌వండి ==> హైపర్ ఆదికి అవమానం.. స్టేజ్ మీదే బట్టలు చించేశారు !

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp