Anchor Varshini : ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందా? : యాంకర్ వర్షిణి

Anchor Varshini Satires On varalakshmi Vratham Pooja Pic
Anchor Varshini :యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో చేసే అల్లరి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తెరపై ఎక్కడా కనిపించకపోయినా కూడా వర్షిణికి ఉండే ఫాలోయింగ్ వేరు. తెరపై కనిపించినా కనిపించకపోయినా, షోలు చేసినా చేయకపోయినా కూడా వర్షిణి క్రేజ్ మాత్రం ఎక్కడా ఇంచు కూడా తగ్గదు. ఇప్పుడు వర్షిణికి బుల్లితెరపై ఎలాంటి అవకాశాలు రావడం లేదు. ఉన్న ఒక్క కామెడీ స్టార్స్ షో కూడా పోయింది.

Anchor Varshini Satires On varalakshmi Vratham Pooja Pic
కావాలని వర్షిణియే అక్కడి నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తుండటంతో షో నుంచి వెళ్లిపోయిందని కొందరు అంటున్నారు. బిగ్ బాస్ షోలో చాన్స్ రావడంతోనే ఇలా వెళ్లిపోయిందని ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి వర్షిణి Anchor Varshini మాత్రం ఇలా షో నుంచి తప్పుకోవడం చర్చనీయాంశంగానే మారింది. ఇక శాకుంతలం, మళ్లీ మొదలైంది సినిమాలతో వర్షిణి బిజీగా ఉన్నారు.

Anchor Varshini Satires On varalakshmi Vratham Pooja Pic
Anchor Varshini : ఈ సమాజం నన్ను అంగీకరిస్తుందా? : యాంకర్ వర్షిణి
అయితే వర్షిణి తాజాగా ఓ అనుమానాన్ని వెళ్లిబుచ్చింది. నిన్న వరలక్ష్మీ వ్రతం కదా? పూజ చేయలేదని, వాటి ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేయలేదని ఈ సమాజం తనను అంగీకరిస్తుందా? మావా బ్రో అంటూ సెటైరికల్‌గా కౌంటర్ వేసింది. నిన్న రాత్రి కారులోతన ఫ్రెండ్‌తో ఎటో వెళ్తోన్న వర్షిణి ఈ మేరకు కామెంట్లు చేసినట్టుంది. మొత్తానికి ఏది జరిగినా? ఏం చేసినా కూడా అందరూ ఇన్ స్టాలో చెప్పాల్సిందేనా? అనేట్టుగా వర్షిణి కౌంటర్ వేసినట్టుంది.