డబ్బుల కోసం పీక్కుతినే భార్యలతో ఫన్.. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈసారి ఖతమే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

డబ్బుల కోసం పీక్కుతినే భార్యలతో ఫన్.. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈసారి ఖతమే!

 Authored By uday | The Telugu News | Updated on :13 December 2020,1:15 pm

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో నిలిచి వంద కోట్లకు పైగా కొల్లగొట్టి దిల్ రాజు కెరీర్‌లోనే హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలా ఎఫ్ 2 సినిమాపై విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సీక్వెల్‌కు ప్లాన్ చేశారు. మూములుగా అయితే వచ్చే సంక్రాంతికి సినిమా రెడీ అయ్యేది. Anil Ravipudi shares F3 Concept poster

Anil Ravipudi shares F3 Concept posterకానీ కరోనా వల్ల ఆలస్యమైంది. ఇప్పటికీ పరిస్థితులు చక్కబడకపోవడంతో షూటింగ్ మొదలుపెట్టడం లేదు. కానీ నేడు వెంకటేష్ బర్త్ డే. ఈ సందర్భంగా ఎఫ్ 3 కాన్పెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోనే సినిమా థీమ్ ఎలా ఉంటుందో ఓ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ సారి మోర్ ఫన్ అంటూ ఎఫ్ 3 గురించి హింట్ ఇచ్చేశాడు. అయితే ఇందులో అనిల్ రావిపూడి ఓ ట్వీట్ చేశాడు. దాంతో కథ మొత్తం అర్థమైంది.

‘Issue డబ్బులు అయినప్పుడు మరి ఫన్ peaks లొనే ఉంటుందిగా…అంతేగా అంతేగా…’ అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో డబ్బు కోసం వేధించే పెళ్లాలు, వారి చేతిలోరోస్ట్ అయ్యే మొగుళ్ల కథలు తెలుగు తెరపై ఎన్నోవచ్చాయి. మళ్లీ ఆ పాత కాన్సెప్ట్‌ను నేటి ట్రెండ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేర్చినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ కాంబో మళ్లీ నవ్వుల పంటను పండించేలా ఉంది.

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది