మంచి ఊపులో ఉంది.. అందరికీ ఇచ్చి పడేసిన అన్నపూర్ణమ్మ!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మంచి ఊపులో ఉంది.. అందరికీ ఇచ్చి పడేసిన అన్నపూర్ణమ్మ!!

 Authored By uday | The Telugu News | Updated on :13 January 2021,9:00 am

సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఈ మధ్య వార్తల్లో బాగానే వైరల్ అవుతోంది. ఆ మధ్య వెండితెరపై, ఇప్పుడు బుల్లితెరపై హాట్ టాపిక్ అవుతోంది. ఎఫ్ 2 సినిమాతో ఈ సీనియర్ నటీమణులకు బాగానే గిరాకీ పెరిగింది. ఈ మధ్య సీనియర్ నటీమణులు బుల్లితెర షోలతోనూ బిజీగా ఉంటున్నారు. జబర్దస్త్, వావ్, అలీతో సరదాగా వంటి షోలతో సందడి చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ ఆ మధ్య అలీతో సరదాగా షోలో మాట్లాడిన మాటలు బాగానే వైరల్ అయ్యాయి. ఈ కాలంలో దర్శకులు, నిర్మాతలు, తమ రెమ్యూనరేషన్‌ల విషయాలంటూ అన్నింటి గురించి క్లియర్‌గా చెప్పింది.

Annapoorna In Atto Attamma Kuthuro Event

Annapoorna In Atto Attamma Kuthuro Event

ఇక తాజాగా అన్నపూర్ణమ్మ అత్తో అత్తమ్మ కూతురో అనే ఈవెంట్‌లో అన్నపూర్ణమ్మ విచ్చేసింది. రోజా అత్తగా నటిస్తున్న ఈ ఈవెంట్‌లో రాం ప్రసాద్, ఆది, ఇమాన్యుయేల్‌లో అల్లుళ్లుగా నటిస్తున్నారు. వారికి జోడిగా రోహిణి, అనసూయ, వర్షలు నటించారు. అయితే ఈ ఈవెంట్‌లో సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా అన్ని కార్యక్రమాలను పెట్టేశారు. ఇందులో కోడిపందెలకు బదులుగా ట్రాక్టర్ పోటీలు, ముగ్గుల పోటీలు ఇలా అన్ని కార్యక్రమాలను పెట్టేశారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో అయితే అన్నపూర్ణమ్మ చెలరేగిపోయింది.

వచ్చీ రాగానే అందరికీ పంచ్‌లు ఇచ్చి పడేసింది. రాం ప్రసాద్ తరుపున పెద్దమ్మగా మాట్లాడేందుకు వచ్చింది. వంద ఎకరాల చెరుకు తోటను కట్నం ఇస్తానంటూ.. అందులో పడి తినే ఏనుగును కట్టుకున్నాడంటూ రోహిణిపై సెటైర్ వేసింది. ఇక ఎంత ఉంటే అంత అనే ఎఫ్2 పాపులర్ డైలాగ్‌తో రోజాకే పిచ్చెక్కించింది. మేం అడుక్కోడానికి రాలేదు.. నువ్వు ఇస్తానంటే వచ్చాను అంటూ రోజాకు వరుసగా పంచ్‌లు వేస్తూనే ఉంది. దిగిపొద్ది అంటూ ఎంత ఉంటే అంత అంటూ రాం ప్రసాద్‌కు పంచ్ వేసింది. మొత్తానికి అన్నపూర్ణమ్మ టైమింగ్ మాత్రం అదుర్స్ అని అందరూ కామెంట్లు పెడుతున్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది